బంగాల్లోని మైనా జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. కన్నవారింటికి వెళ్లొద్దన్నారన్న కోపంతో దారుణానికి ఒడిగట్టింది ఓ కోడలు. మామ మర్మాంగాలను కోసి పడేసింది.
పోలీసుల వివరాల ప్రకారం.. తూర్పు మేదినీపుర్ పోలీస్‌స్టేషన్ పరిధికి చెందిన శిఖా అనే మహిళను మాంసం తినేందుకు తన తండ్రి రమ్మని ఫోన్ చేశాడు. వెంటనే ఆమె తన భర్తకు కాల్ చేయగా.. అతడి వెళ్లవద్దని చెప్పాడు. తాను చికెన్ తెస్తానని ఇంట్లోనే వండుకుని తిందామని తెలిపాడు. కాల్ కట్ చేసిన తర్వాత మహిళ.. కోపంతో తన అత్తామామలను తీవ్రంగా దూషించింది. అది కాస్తా వాగ్వాదానికి దారితీసింది.
దీంతో మరింత కోపం పెంచుకున్న మహిళ.. తన మామ మర్మాంగాలను కత్తితో కోసిపడేసింది. అతడు నొప్పితో గట్టిగా కేకలు పెట్టగా.. స్థానికులు వచ్చి ఆస్పత్రిలో చేర్పించారు. స్థానికులు మహిళను బంధించారు. అయితే ఆమె విడిపించుకుని కన్నవారింటికి పారిపోయింది. అనంతరం బాధితుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితురాల్ని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. విచారణ జరిపిన కోర్టు ఆమెకు 14 రోజుల కస్టడీ విధించింది.
ఏడేళ్ల బాలిక హత్య..
మహారాష్ట్రలోని ఇందోర్‌లో ఏడేళ్ల బాలికను ఎత్తుకుపోయి దారుణ హత్య చేసిన ఘటన వెలుగుచూసింది. గమనించిన స్థానికులు.. నిందితుడ్ని పోలీసులకు అప్పగించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. ఆజాద్ నగర్ పోలీస్‌స్టేషన్ ప్రాంతానికి చెందిన ఏడేళ్ల బాలికను.. అదే ప్రాంతంలో ఉంటున్న సద్దాం అనే యువకుడు ఎత్తుకుపోయాడు. అనంతరం తన ఇంటికి తీసుకెళ్లి తలుపు గడియపెట్టాడు. ఇది చూసిన ఓ బాలుడు.. స్థానికులకు తెలియజేశాడు. వెంటనే స్థానిక ప్రజలంతా సద్దాం ఇంటి వద్దకు చేరుకుని బాలికను విడిచిపెట్టమని ప్రాధేయపడినా అతడి వినిపించుకోలేదు.
తలుపులు పగలగొట్టి లోపలకు వెళ్లి చూడగా బాలిక విగతజీవిగా పడి ఉంది. చిన్నారిని పలుమార్లు కత్తితో పొడిచి చంపాడు సద్దాం. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. స్థానికులు.. సద్దాంను పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడ్ని అరెస్ట్ చేశారు.
పెళ్లి చేసుకుంటానని చెప్పి కారులో అనేక సార్లు రేప్..
మహారాష్ట్రలోని ఠానే జిల్లాలో బాలీవుడ్ సినిమా తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. స్నేహాన్ని ప్రేమగా మార్చుకుని ఓ యువతితో పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు ఆమె ప్రియుడు. పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి బయటకు తీసుకెళ్లి కారులో అనేకసార్లు అఘాయిత్యానికి ఒడిగడుతూ మానసికంగా వేధించాడు. కానీ ఎప్పటికీ వివాహం చేసుకోకపోవడం వల్ల బాధితురాలు మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నం చేసుకుంది.
పోలీసుల వివరాల ప్రకారం..బాధితురాలు తన కుటుంబంతో బద్లాపుర్‌లో గత ఐదు నెలలుగా నివసిస్తోంది. అయితే అంతకుముందు 2017లో అదే ప్రాంతంలో నివసించే మహేంద్ర అనే యువకుడితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ఏడాదిలోపు ప్రేమగా మారింది. అయితే నిందితుడు.. ప్రేమను అవకాశంగా తీసుకుని బాధితురాల్ని శారీరకంగా వేధించడం మొదలుపెట్టాడు. దీంతో ఆమె మహేంద్రతో మాట్లడడం మానేసింది. దాదాపు రెండేళ్ల పాటు వీరిద్దరు మాట్లాడుకోలేదు.
మళ్లీ ఈ ఏడాది ఏప్రిల్‌లో మహేంద్రతో బాధితురాలు మాట్లడడం మొదలుపెట్టింది. ఓ రోజు.. తన కారులో ఆమెను బయటకు తీసుకెళ్లి మార్గమధ్యలో మాయమాటలు చెప్పి అత్యాచారం చేశాడు. దీంతో బాధితురాలు భయపడి ఏడ్చింది. అయితే పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడు యువకుడు. కానీ వివాహం చేసుకోకుండా కాలయాపన చేశాడు. ఆ తర్వాత మే నుంచి సెప్టెంబరు వరకు పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆమెపై పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడుతూ మానసికంగా వేధించాడు. ఆ తర్వాత ఆమె మొబైల్ నంబర్‌ను కూడా బ్లాక్ కూడా చేశాడు.