Woman Cuts Off Man Private Parts :ఉత్తర్‌ప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లాలో అత్యాచారం చేసేందుకు యత్నించిన యువకుడి ప్రైవేట్ భాగాలను ఓ మహిళ కోసేసింది. అనంతరం వాటిని పాలిథిన్ కవర్లో పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి జరిగినదంతా చెప్పింది. అయితే కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మహిళను అదుపులోకి తీసుకున్నారు. అసలేం జరిగిందంటే?
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..జిల్లాలోని మంజన్పుర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. బాధిత మహిళ భర్త సౌదీ అరేబియాలో పనిచేస్తున్నాడు. బాధితురాలి వద్ద పనిచేస్తున్న ఓ యువకుడు.. మంగళవారం మధ్యాహ్నం ఎవరూ లేని సమయంలో ఆమెపై అత్యాచారం చేసేందుకు యత్నించాడు. ఆమె ప్రతిఘటించగా.. బలవంతంగా గదిలోకి తీసుకెళ్లాడు. అయితే అతడిని మాటల్లో పెట్టి.. వంటగదిలోకి వెళ్లి కత్తి తెచ్చింది మహిళ. ఒక్కసారిగా నిందితుడి జననాంగాలను కోసేసింది. ప్రైవేట్ భాగాలను కవర్లో తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది.
అయితే ఘటనాస్థలి నుంచి యువకుడు ఎలాగోలా తప్పించుకుని తన ఇంటికి చేరుకున్నాడు. కుటుంబసభ్యుల సహాయంతో ప్రైవేట్ ఆస్పత్రిలో చేరాడు. తాను చాలా ఏళ్ల నుంచి ఆ మహిళ వద్దే పనిచేస్తున్నట్లు యువకుడి చెప్పాడు. తన నోట్లో వస్త్రం కుక్కి ఆమె తన ప్రైవేట్ భాగాలను కోసేసిందని తెలిపాడు. అత్యాచారం ఆరోపణలను యువకుడు ఖండించాడు. యువకుడి తరఫున కుటుంబసభ్యులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఇరు వైపుల ఫిర్యాదులు అందుకున్న పోలీసులు.. మహిళను అదుపులోకి తీసుకున్నారు. కత్తిని స్వాధీనం చేసుకున్నారు.