Woman Cut Private Parts Of Her Lover : నలుగురు పిల్లల తల్లితో ప్రేమాయణం సాగించాడు ఓ యువకుడు. కలవాలని ఉంది రమ్మంటూ ప్రియుడిని ఇంటికి పిలిచింది ఆ మహిళ. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య గొడవ జరగడం వల్ల ఆగ్రహించి అతడి ప్రైవేట్ భాగాలను కత్తితో కొసేసింది. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఖుషీనగర్ జిల్లాలో గురువారం రాత్రి జరిగింది. తీవ్ర రక్తస్రావంతో ఘటనాస్థలి నుంచి తప్పించుకున్న ఆ యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఇదీ జరిగింది
ఖడ్డా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన మహిళ గురువారం రాత్రి 9:30 గంటల సమయంలో అదే ప్రాంతంలో ఉండే తన ప్రియుడికి ఫోన్ చేసి ఇంటికి రమ్మని పిలిచింది. దీంతో ఆ యువకుడు మహిళ ఇంటికి వెళ్లాడు. ఈ క్రమంలో ఏదో విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో ఆగ్రహానికి గురైన వివాహిత ఇంట్లోని పదునైన కత్తితో అతడి ప్రైవేటు భాగాలను కట్ చేసింది. దీంతో అతడికి తీవ్ర రక్తస్రావం అయింది. అప్పటికే స్పృహలో ఉన్న బాధితుడు దగ్గర్లోని ఆస్పత్రికి పరుగులు తీశాడు. గాయం తీవ్రంగా ఉండడం వల్ల అతడిని జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ యువకుడు చికిత్స పొందుతున్నాడు. కాగా, ఈ ఘటనపై ఇప్పటివరకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని స్థానిక పోలీసులు అంటున్నారు.
ఉద్యోగరీత్యా మహిళ భర్త విదేశాల్లో ఉంటున్నాడు. ఈ క్రమంలోనే యువకుడికి నలుగురు పిల్లల తల్లితో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారి తీసిందని ఖడ్డా పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ నీరజ్ రాయ్ పేర్కొన్నారు. అతడు తరచూ మహిళ ఇంటికి వచ్చివెళ్లే వాడని చెప్పారు. ఇక ఈ ఘటనకు సంబంధించి రాతపూర్వకంగా ఫిర్యాదు అందిన వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.