తెలంగాణ

telangana

ETV Bharat / bharat

డబ్బు, ఫోన్​ కోసం కొవిడ్ రోగిని కిరాతకంగా... - డబ్బు కోసం కొవిడ్ రోగి హత్య

డబ్బు, సెల్​ఫోన్​ కోసం ఓ కొవిడ్​ రోగిని దారుణంగా హత్య చేసింది ఆస్పత్రిలో పనిచేసే కాంట్రాక్ట్ వర్కర్. రోగిని వీల్​ఛైర్​లో తీసుకెళ్లి గొంతు నులిమి చంపింది. పోలీసుల విచారణలో నిందితురాలు తన నేరాన్ని ఒప్పుకుంది.

Woman contract worker at Chennai GH held for murder of COVID patient
డబ్బు కోసం కొవిడ్ రోగిని కిరాతకంగా...

By

Published : Jun 16, 2021, 3:45 PM IST

ఆస్పత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్​ వర్కర్.. ఓ కరోనా రోగిని డబ్బుల కోసం కిరాతకంగా హత్య చేసింది. స్కానింగ్ కోసమని చెప్పి తీసుకెళ్లి.. గొంతు నులిమి చంపేసింది. చివరకు శవాన్ని మెట్ల దగ్గర పాడేసి పారిపోయింది. తమిళనాడు చెన్నైలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఈ ఘటన జరిగింది.

మృతురాలిని ఏళ్ల పశ్చిమ తాంబరాంకు చెందిన సునీతగా అధికారులు గుర్తించారు. కరోనా లక్షణాలతో మే 23న మహిళ ఆస్పత్రిలో చేరినట్లు తెలిపారు. వార్డులో నుంచి కనిపించకుండా పోవడం వల్ల సునీత భర్త.. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు. విచారణలో భాగంగా ఈ అమానుషానికి పాల్పడింది ఆస్పత్రిలో పనిచేసే రతీదేవీ(40) అని తేలినట్లు పోలీసులు వెల్లడించారు.

"కుళ్లిన స్థితిలో ఓ శవం ఆస్పత్రి భవనం ఎనిమిదో ఫ్లోర్​లో జూన్ 8న బయటపడింది. ఈ మృతదేహం సునీతదేనని నిర్ధరించాం. రోగిని ఓ మహిళా కాంట్రాక్ట్ వర్కర్ మూడో ఫ్లోర్​ నుంచి వీల్​ ఛైర్​లో తీసుకెళ్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది."

-సీనియర్ పోలీస్ అధికారి

రతీదేవిని బుధవారం అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు. నిందితురాలిని ప్రశ్నించగా.. డబ్బు, సెల్​ఫోన్​ కోసమే రోగిని హత్య చేసినట్లు ఒప్పుకుందని తెలిపారు.

ఇదీ చదవండి:సాధారణ జలుబు‌తో కొవిడ్‌ నుంచి రక్షణ!

ABOUT THE AUTHOR

...view details