తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రెండు రోజుల్లో పెళ్లి.. గ్రాండ్​గా హల్దీ వేడుక.. ఇంతలోనే శవమై కనిపించిన లేడీ కానిస్టేబుల్​ - పెళ్లికూతురు మృతి

ఉత్తర్​ప్రదేశ్​ మేరఠ్​లో పెళ్లింట విషాదం నెలకొంది. హల్దీ వేడుక అనంతరం స్నానానికి వెళ్లిన వధువు.. బాత్​రూంలోనే శవమై కనిపించింది.

Woman constable dies before marraige
Woman constable dies before marraige`

By

Published : Feb 6, 2023, 6:38 PM IST

రెండు రోజుల్లో పెళ్లి. వివాహానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. బంధువులు, స్నేహితుల మధ్య హల్దీ వేడుక సైతం ఘనంగా జరిగింది. కానీ ఇంతలోనే స్నానం కోసం బాత్​రూంకు వెళ్లిన వధువు.. శవమై కనిపించింది. ఈ విషాద ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని మేరఠ్​లో ఆదివారం జరిగింది.

అప్పటి వరకు ఆనందంగా..
అహ్మదాబాద్​కు చెందిన మున్నీ దేవి కూతురు గీతా.. ముజఫర్​నగర్​లో కానిస్టేబుల్​గా విధులు నిర్వర్తిస్తోంది. ఆమెకు ఈనెల 7న బులంద్​శహర్​కు చెందిన సుమిత్​తో వివాహం నిశ్చయించారు. ఈ క్రమంలోనే పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఆదివారం హల్దీ వేడుక సందర్భంగా గీతకు పసుపు పూశారు. అనంతరం స్నానం చేసేందుకు బాత్​రూంకు వెళ్లింది గీత.

హల్దీ వేడుకలో గీత

సుమారు 45 నిమిషాలు దాటినా రాకపోవడం వల్ల.. కుటుంబసభ్యులు తలుపు కొట్టి పిలిచారు. లోపలి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం వల్ల అనుమానించిన కుటుంబ సభ్యులు.. బాత్​రూం తలుపులు పగులగొట్టి చూడగా అపస్మారక స్థితిలో కనిపించింది. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు.. ఆస్పత్రికి తరలించారు. గీతను పరీక్షించిన వైద్యులు.. ఆమె మరణించినట్లుగా ధ్రువీకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాతే మృతికి గల అసలు కారణాలు తెలుస్తాయని పోలీసులు చెప్పారు.

వివాహ పత్రిక

ఇవీ చదవండి :కుమార్తె మృతి.. మృతదేహంతో రెండు రోజులు ఇంటింటికీ తిరిగిన తల్లి

60 చదరపు అడుగుల దుకాణం ఖరీదు రూ.1.72కోట్లు.. అంత ధర ఎందుకంటే..

ABOUT THE AUTHOR

...view details