తెలంగాణ

telangana

ETV Bharat / bharat

14జిల్లాల్లో 10మంది మహిళా కలెక్టర్లే.. కేరళ ఘనత! - జిల్లా కలెక్టరు

Woman Collector in Kerala: మహిళా సాధికారతకు అద్దం పడుతోంది కేరళ ప్రభుత్వ పరిపాలన. ఆ రాష్ట్రంలోని 14 జిల్లాల్లో పదింటికి కలెక్టర్లు మహిళలే కావడం ఇందుకు నిదర్శనం.

Woman Collector in Kerala
kerala collector

By

Published : Mar 1, 2022, 2:58 PM IST

Woman Collector in Kerala: అలపుళ జిల్లా కలెక్టర్​గా డా. రేణురాజ్​ను నియమించడం వల్ల​ రాష్ట్ర పాలన యంత్రాంగంలో కొత్త చరిత్ర సృష్టించింది కేరళ ప్రభుత్వం. రేణురాజ్​ బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో రాష్ట్రంలోని 14జిల్లాల్లో మహిళా జిల్లా కలెక్టర్ల సంఖ్య 10కి చేరింది. పాలనా పరంగా మహిళల ప్రాతినిధ్యం తక్కువగా ఉన్న దేశంలో ఇలాంటి ఘనత అభినందనీయం!

డా.రేణురాజ్ (అలపుళ)

కొట్టాయంకు చెందిన డా.రేణురాజ్​.. 2014 సివిల్ సర్వీసెస్​ పరీక్షలో తొలి ప్రయత్నంలోనే రెండో ర్యాంకు సాధించారు. ఆమె మెడికల్ గ్రాడ్యుయేట్​ కూడా.

నవజ్యోత్​ ఖోస్​ (తిరువనంతపురం)
అఫ్సానా పర్వీన్ (కొల్లం)
దివ్య అయ్యర్ (పతనంతిట్ట)

రేణురాజ్​ కంటే ముందే కేరళలో 9జిల్లాల్లో మహిళా పాలనాధికారులున్నారు. రాష్ట్ర పరిపాలన చరిత్రలోనే ఇది రికార్డు. ప్రజానుకూల విధానాలతో సమర్థవంతమైన పాలన అందిస్తూ.. వారు ప్రసిద్ధి చెందారు.

పీకే జయశ్రీ (కొట్టాయం)
షీబా జార్జ్​ (ఇడుక్కి)
హరిత వి.కుమార్ (త్రిశూర్)

కేరళ ప్రభుత్వం కూడా వారి ప్రతిభను గుర్తించింది. రెవెన్యూ డే సెలబ్రేషన్స్​ సందర్భంగా అందించిన మూడు ఉత్తమ జిల్లా కలెక్టర్ల అవార్డులు మహిళా పాలనాధికారులకే దక్కాయి.

మృన్మయి జోషి (పాలక్కడ్​)
గీతా (వయనాడ్)
భండారి స్వాగత్​ రణ్వీర్​చాంద్ (కాసర్​గోడ్​)

ఇదీ చూడండి:యంగ్ మేయర్.. యువ ఎమ్మెల్యే.. త్వరలో ఏడడుగులు!

ABOUT THE AUTHOR

...view details