Woman chops off husband head: త్రిపురలో ఖోవై జిల్లాలో దారుణం జరిగింది. 50 ఏళ్ల భర్తను ఓ మహిళ అత్యంత క్రూరంగా నరికి చంపింది. అలా శరీరం నుంచి వేరైన తలను ఓ ప్లాస్టిక్ సంచిలో వేసుకొని వచ్చి స్థానికంగా ఉంటే గుడి ముందు వేలాడ తీసింది. ఈ ఘటన శనివారం ఉదయం జరిగినట్లు పోలీసులు తెలిపారు. నిందితురాలిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు.
హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని ఖోవై పోలీస్ సూపరింటెండెంట్ భావుపాద చక్రవర్తి చెప్పారు. అయితే తన తల్లి ఇటీవల మానసిక రుగ్మతతో బాధపడుతోందని నిందితురాలి పెద్ద కుమారుడు తెలిపాడు. ఇందుకు గానూ స్థానికంగా ఉండే ఓ క్షుద్ర వైద్యుడి వద్ద చికిత్స చేయించుకున్నట్లు పేర్కొన్నాడు.
నిందితురాలు తన భర్త ఇద్దరు పిల్లలతో కలిసి ఉండేదని అధికారులు తెలిపారు. హత్యకు గురైన వ్యక్తి పేరు రవీంద్ర తంతి అని పేర్కొన్నారు. ఆయన రోజు వారి కూలి పనుల చేస్తుండే వారిని చెప్పారు.
'మా అమ్మ ఎప్పుడూ మాంసం తినేది కాదు. కానీ ఆమె నిన్న రాత్రి ఇంట్లో చికెన్ చేసింది. తిన్నాక అందరం నిద్రపోయాం. నాకు అకస్మాత్తుగా మెళుకువ వచ్చింది. లేచి చూసేసరికి అమ్మ.. నాన్న తల నరికేసింది. అప్పటికే అమ్మ చేతిలో ఆయుధం ఉంది. శరీరం అంతా రక్తంతో తడిసి ఉంది. అది చూసి నేను ఆశ్చర్యపోయాను. నేను అలానే పడుకుండి పోయాను.. అలారంతో లేచి చూసేసరికి అమ్మ గదిలో లేదు. గుడి దగ్గరకు నాన్న తలను తీసుకుని వెళ్లింది.
- నిందితురాలి పెద్ద కుమారుడు