తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మంత్రాల నెపంతో మహిళ సజీవ దహనం- ఇద్దరు పిల్లల ముందే - అసోంలో మహిళ సజీవ దహనం

Woman Burnt Alive on Suspicion of Superstition : టెక్నాలజీ ఇంతలా అభివృద్ధి చెందుతున్న ఈ రోజుల్లో కూడా ప్రజలు ఇంకా మూఢ నమ్మకాలతోనే జీవిస్తున్నారు. తాజాగా తాంత్రికురాలనే నెపంతో ఓ మహిళను సజీవం దహనం చేశారు. ఈ అమానుష ఘటన అసోం​లో జరిగింది.

Woman Burnt Alive on Suspicion of Superstition
Woman Burnt Alive on Suspicion of Superstition

By ETV Bharat Telugu Team

Published : Dec 25, 2023, 5:12 PM IST

Updated : Dec 25, 2023, 6:23 PM IST

Woman Burnt Alive on Suspicion of Superstition : మంత్రాల నెపంతో ఓ మహిళను దారుణంగా హత్య చేశారు. పిల్లల ముందే మహిళను సజీవ దహనం చేశారు. ఈ అమానుష ఘటన అసోంలోని తేజ్​పుర్​లో ఆదివారం జరిగింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదీ జరిగింది
బన్స్​బరీకి చెందిన సంగీత క్షుద్ర పూజలు చేస్తుందంటూ అదే గ్రామానికి చెందిన సూరజ్​ బగ్వా కుటుంబం ఆమె దాడి చేసింది. పదునైన ఆయుధంతో ఆదివారం రాత్రి ఆమెపై దాడి చేశారు. అనంతరం ఇద్దరు పిల్లల ముందే ఆమెను సజీవ దహనం చేశారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వీరిలో మగ్గురిని అజయ్ సంఘర్, టింకో మల్హర్, సూర్య బగ్వాగా గుర్తించగా, మరొకరి పేరు తేలియాల్సి ఉంది. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. వారి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. వీరిద్దరికి ముందే పాత కక్షలు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. ప్రజల్లో మూఢ నమ్మకాల నిర్మూలనకు వ్యతిరేకంగా అవగాహన కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.

'చేతబడితో కొడుకు మృతి!'.. భార్యతో కలిసి తండ్రిని హత్య చేసిన వ్యక్తి
అంతకుముందు ఝార్ఖండ్ పలామూ జిల్లాలోని మాఝియావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోనూ ఇలాంటి ఘటన జరిగింది. చేతబడి చేశాడన్న అనుమానంతో కన్నతండ్రిని హత్య చేశాడు ఓ వ్యక్తి. తన భార్యను సైతం ఈ నేరంలో భాగం చేశాడు. ఘటన తర్వాత నిందితులు ఇద్దరు ఇంట్లో నుంచి పారిపోయారు. మాఝియావ్​కు చెందిన ధనుకీ(మృతుడు) తాంత్రికుడిగా పనిచేసేవాడు. కొద్దిరోజుల క్రితం తన కొడుకు బలరామ్​తో ధనుకీ గొడవపడ్డాడు. ఈ ఘటన జరిగిన తర్వాత బలరామ్ చిన్న కొడుకు చనిపోయాడు. దీనికి తన తండ్రే కారణమని భావించిన బలరామ్, అతడిపై కోపం పెంచుకున్నాడు. పూజల కోసం ధనుకీ బయటకు వెళ్లేందుకు సిద్ధమైన సమయంలో బలరామ్, అతడి భార్య కలిసి దాడి చేశారు. ధనుకీని తీవ్రంగా కొట్టారు. గాయపడ్డ అతడిని స్థానికులు పలామూలోని ఓ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ధనుకీ మరణించాడు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి

'నరబలి' కేసులో ట్విస్టులే ట్విస్టులు.. లైలా కోసమే ఇదంతా.. నెక్ట్స్ టార్గెట్ ఆమె భర్తే

మరణించిన కొడుకు బతికొస్తాడని 30 గంటలు పూజలు.. ఆ పాము కోసం వేట!

Last Updated : Dec 25, 2023, 6:23 PM IST

ABOUT THE AUTHOR

...view details