అనాథ ఆశ్రమంలోని బాలికల పట్ల అనూనుషంగా ప్రవర్తించింది ఓ మహిళ. ఇద్దరు చిన్నారులను విచక్షణారహితంగా కొట్టింది. చిన్నారులపై దాడి చేసిన అనాథ ఆశ్రమం నిర్వహకురాలిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని.. సోమవారం అరెస్ట్ చేశారు. ఈ దారుణ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్‌లో జరిగింది.
ఇదీ జరిగింది..
సీమా ద్వివేది అనే మహిళ.. 'విశేషకృత్ దత్తక్ గ్రహణ్ ఏజెన్సీ' అనే అనాథ ఆశ్రమాన్ని నిర్వహిస్తోంది. ఆమె శనివారం.. ఇద్దరు చిన్నారులపై పాశవికంగా దాడి చేసింది. ఈ దారుణాన్ని గుర్తు తెలియని వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఆ వీడియో కాస్తా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారి.. పోలీసుల దృష్టికి చేరింది. దీంతో పోలీసులు.. నిందితురాలు సీమా ద్వివేదిని అరెస్ట్ చేశారు.
ఏడుస్తూ ప్రాధేయపడినా..
నిందితురాలు సీమా ద్వివేది.. మొదట ఓ బాలికను తీవ్రంగా కొట్టింది. ఆపై చిన్నారి జుట్టును పట్టుకుని నేలకేసి బాదింది. ఆ బాలికను పైకి లేపి మళ్లీ మంచంపైకి విసిరేసింది. ఆ చిన్నారి తనను కొట్టొద్దని ఎంత ఏడ్చి ప్రాధేయపడినా.. నిందితురాలు వినకుండా క్రూరంగా ప్రవర్తించింది. ఈ తర్వాత అక్కడే ఉన్న మరో బాలికను పిలిచి.. ఆ చిన్నారిపై కూడా పాశవికంగా దాడికి దిగింది. చిన్నారులపై దాడి జరుగుతున్న సమయంలో అటుగా వెళ్తున్న ఇద్దరు మహిళలు.. ఆమెను ఆపే ప్రయత్నం చేయలేదు.
ఇద్దరు చిన్నారులపై ఆశ్రమ నిర్వహకురాలి దాడి.. జుట్టు పట్టుకుని నేలకేసి కొట్టి.. వీడియో వైరల్ గతేడాది కూడా ఇలానే చిన్నారులపై ఆకృత్యాలకు పాల్పడింది సీమా ద్వివేది. ఆమెపై మహిశా శిశు సంక్షేమ శాఖకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. వారు సీమా ద్వివేదిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఆ తర్వాత దాదాపు ఏడాది వ్యవధిలో తనపై ఫిర్యాదు చేసిన 8 మంది ఉద్యోగులను తొలగించింది సీమా. అధికారులు లంచం తీసుకుని సీమాపై చర్యలు తీసుకోలేదని అనాథ ఆశ్రమం ఉద్యోగులు అప్పట్లో ఆరోపించారు. మళ్లీ సీమా ద్వివేది అసలు బుద్ధి బయటపడడం వల్ల ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ అనాథ ఆశ్రమంలో ఆరు సంవత్సరాలలోపు వయసున్న అనాథ పిల్లలు ఉంటారు. చిన్నారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆశ్రమంలో 8 సీసీటీవీ కెమెరాలను సైతం ఏర్పాటు చేశారు. వీటిని రాత్రి పూట సీమా ద్వివేది ఆపేస్తారని ఆరోపణలు కూడా ఉన్నాయి.
అదనపు కట్నం కోసం భార్యపై దారుణం..
ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓ యువకుడు తన భార్య పట్ల క్రూరంగా ప్రవర్తించాడు. కర్రతో భార్యను పాశవికంగా చితకబాదాడు. వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందంటూ మహిళను అసభ్యపదజాలంతో ధూషించాడు. ఈ దాడి దృశ్యాలను వీడియో తీశాడు.
అసలేం జరిగిందంటే..
ఇటావాకు చెందిన శివమ్ యాదవ్ అనే వ్యక్తికి అవదేశ్ యాదవ్ అనే యువతిలో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. శివమ్.. ఓ ప్రైవేట్ వాహనం డ్రైవర్. తరచుగా అదనపు కట్నం కోసం శివమ్.. తన భార్య అవదేశ్‌ను కొట్టేవాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి ఇంట్లో ఉన్న భార్య, తన ఇద్దరు కుమార్తెలపై దాడి చేశాడు. స్పృహ కోల్పోయిన స్థితిలో ఉన్న అవదేశ్‌ను వదిలేసి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ విషయం బాధితురాలి తల్లికి తెలిసింది. వెంటనే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటికే నిందితుడు శివమ్ యాదవ్, అతడి కుటుంబ సభ్యులు ఇళ్లు వదిలి పారిపోయారు. బాధితురాలు ఓ ప్రైవేట్ నర్సింగ్ హోమ్‌లో చికిత్స పొందుతోంది. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు.