Acid Attack: అప్పు కట్టలేదని.. మహిళపై యాసిడ్ దాడి - Krishna District latest news

16:41 May 02
కొన్ని నెలల నుంచి వేధింపులు
Acid Attack: దేశంలో మహిళలపై రోజూ ఏదో ఒక కోణంలో వేధింపులు, దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా కృష్ణా జిల్లాలో ఓ మహిళపై యాసిడ్ దాడి జరిగింది. కృష్ణా జిల్లా పెడనలో తీసుకున్న అప్పు కట్టలేదని రామలక్ష్మి కాలనీకి చెందిన కరుణ కుమారి అనే మహిళపై రాముడు అనే వ్యక్తి యాసిడ్ దాడి చేయడం కలకలం రేపింది. కుటుంబ అవసరాల నిమిత్తం రాముడు అనే వ్యక్తి వద్ద కరుణ కుమారి 5 రుపాయల వడ్డీకి రూ.20 వేలు అప్పుగా తీసుకుంది. బాకీ తీర్చడం ఆలస్యం కావడంతో కొన్ని నెలల నుండి రాముడు తనను వేదింపులకు గురి చేస్తున్నాడని కరుణ కుమారి ఆవేదన వ్యక్తం చేస్తోంది. కరుణ కుమారి భర్త ఇంట్లో లేని సమయంలో రాముడు యాసిడ్తో దాడి చేశాడు. యాసిడ్ దాడి జరగడంతో కరుణ కుమారి బిగ్గరగా కేకలు వేసింది. ఇది విని స్థానికులు అక్కడకు వచ్చే సరికి రాముడు పరారయ్యాడు. చికిత్స నిమిత్తం కరుణ కుమారిని పోలీసులు మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఇవీ చదవండి :