పబ్జీ, మద్యానికి బానిసైన ఓ మహిళ తన సొంత అక్క ఇంట్లోనే దొంగతనానికి ప్రయత్నించి.. పోలీసులకు చిక్కింది. ఇందుకు సాయం చేసిన తన స్నేహితుడిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన దిల్లీ నగర శివారులోని నిహాల్ విహార్ ప్రాంతంలో జరిగింది.
ఇదీ జరిగింది..
మద్యం, పబ్జీకి బానిసైన జ్యోతి అనే మహిళ.. డబ్బు కోసం తన స్నేహితులు సన్నీ, సైఫ్లతో కలిసి సొంత అక్క ఇంట్లోనే దొంగతనం చేయాలని భావించింది. ఇందులో భాగంగా తన అక్క(శశి)ఇంటికి ఇద్దరు మిత్రులను జ్యోతి పంపింది. వారిద్దరూ.. శశి భర్త పేరుతో ఇంట్లోకి ప్రవేశించారు. వారిలో ఒకరు తుపాకీ తీసి ఆమెను బెదిరించగా.. మరొకడు ఆమె నోరు నొక్కి పట్టుకున్నాడు. డబ్బు కోసం వెతకగా.. ఏమి దొరకలేదు. దీంతో శశిని నేల మీద పడేశారు. ఆమె అరవడంతో బయట తాళం వేసి పారిపోయారు. శశి కేకలకు అక్కడికి చేరుకున్న స్థానికులు.. ఆమెను బయటకు తీసుకొచ్చారు.