తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఉద్యోగం ఆశ చూపి మహిళపై అత్యాచారం.. మద్యం తాగించి మరీ.. - rape case

ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపి మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. బలవంతంగా మద్యం తాగించి, అఘాయిత్యానికి ఒడిగట్టిన కిరాతకుడు.. ఆపై హత్యాయత్నం చేశాడు. దిల్లీలో జరిగిందీ ఘటన.

Delhi rape case
దిల్లీ అత్యాచారం కేసు

By

Published : Nov 9, 2021, 9:41 AM IST

Updated : Nov 9, 2021, 9:47 AM IST

దిల్లీలోని ద్వారకాలో మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కిరాతకుడు. ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి ఇచ్చి.. హోటల్​కు తీసుకెళ్లి అక్కడే ఘాతుకానికి ఒడిగట్టాడు. నవంబర్ 6న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఇదీ జరిగింది..

ఈ నెల 6వ తేదీన అంకిత్​ సెహ్రావత్​ అనే వ్యక్తి ఉద్యోగం ఇప్పిస్తానని బాధితురాలిని సంప్రదించాడు. అదే రోజు ఆమెను బైక్‌పై ఎక్కించుకుని హోటల్‌కు తీసుకెళ్లాడు. హోటల్‌ లోపలికి వెళ్లడానికి ఆమె నిరాకరించింది. అయితే తనకు అందరూ తెలుసునని.. తన తల్లి దిల్లీ పోలీసు అధికారి అని నిందితుడు నమ్మబలికాడు. తీరా లోపలికి వెళ్లాకా బలవంతంగా మద్యం తాగించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై ఆమెను గొంతు నులిమి చంపేందుకు ప్రయత్నించాడు. అది కుదరకపోవడం వల్ల తన ఇనుప కడియంతో కొట్టగా.. ఆమె ముఖంపై గాయమైంది. చివరకు చంపుతానని బెదిరించి.. గదిలో పెట్టి తాళం వేసి పారిపోయాడు.

హోటల్​ గేటు పగలగొట్టి..

తర్వాత బాధితురాలు.. పోలీసులకు ఫోన్ చేసి ఏదో హోటల్​లో ఉన్నట్లు సమాచారం అందించింది. వాట్సాప్​లో లైవ్​ లొకేషన్​ షేర్​ చేసింది. దీని ఆధారంగా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోగా.. ఆ హోటల్​కు లోపల నుంచి తాళం వేసి ఉంది. హోటల్​ మేనేజర్​ గానీ, యజమానికి అక్కడ లేరు. దీంతో ​​హోటల్ గేటును పగలగొట్టి, బాధితురాలిని రక్షించారు. వైద్య పరీక్షల కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. హోటల్​ మేనేజర్​ సంజయ్​ కుమార్​ మాత్రోను అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితుడి కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి:గిరిజన బాలిక​పై అత్యాచారం.. ఇంట్లో నుంచి అపహరించి..

Last Updated : Nov 9, 2021, 9:47 AM IST

ABOUT THE AUTHOR

...view details