తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మహిళా హక్కుల కార్యకర్త బిందు అమ్మినిపై దాడి! - బిందు అమ్మినిపై గుర్తు తెలియని వ్యక్తి దాడి

శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశంపై జరిగిన వివాదం సమయంలో వార్తల్లో నిలిచిన మహిళా కార్యకర్త.. బిందు అమ్మినిపై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన కోజికోడ్​ బీచ్​లో జరిగినట్లు పేర్కొన్నారు.

bindu ammini
బిందు అమ్మిని

By

Published : Jan 5, 2022, 10:53 PM IST

మహిళా హక్కుల కార్యకర్త బిందు అమ్మినిపై దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తి ఆమెపై దాడి చేసినట్లు కేరళ కోజికోడ్​ పోలీసులు తెలిపారు. కోర్టు కేసుకు సంబంధించి కోజికోడ్ నార్త్ బీచ్‌కు చేరుకున్న తనపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని బిందు ఆరోపించింది.

స్థానిక టీవీ ఛానళ్లు ప్రసారం చేసిన దృశ్యాల ప్రకారం అమ్మినిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసినట్లు ఉంది. దీనిపై స్పందించిన అమ్మిని తాను ఏం మాట్లాడకపోయినా.. ఆ వ్యక్తి దాడికి దిగినట్లు చెప్పింది. దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

శబరిమల ఆలయంలో పూజలు చేసేందుకు అన్ని వయస్కుల మహిళలకు అనుమతి ఇవ్వాలని 2019లో సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో అయ్యప్ప స్వామి మందిరంలోకి వెళ్లి బిందు వార్తల్లో నిలిచింది. గతంలో కూడా ఈమెపై ఇలాంటి తరహా దాడి జరిగింది.

ఇదీ చూడండి:ఎన్నికల రాజకీయాన్ని మార్చిన కరోనా- యూపీ కోసం ఇక డిజిటల్ యుద్ధమే!

ABOUT THE AUTHOR

...view details