త్రిపురలోని ఖౌవాయి జిల్లాలో అమానుషం జరిగింది. ఇద్దరు బాలికలపై ఎనిమిది మంది యువకులు అత్యాచారం చేశారు. ఈ ఘటనలో ఒక బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఖటియాబరి ప్రాంతానికి చెందిన ఇద్దరు బాలికలు.. మరో ఇద్దరు స్నేహితులతో సోమవారం సాయంత్రం బైక్ మీద బయటకు వెళ్లారు. కొంత దూరం వెళ్లాక మరో ఆరుగురు.. ద్విచక్రవాహనాలపై వచ్చి వారిని కలిశారు. అంతా కలిసి ఆ బాలికలను దట్టమైన అడవి ప్రాంతానికి సుమారు ఏడున్నర గంటల సమయంలో తీసుకెళ్లారు. అక్కడ ఆ బాలికలపై సాముహికంగా అత్యాచారం చేశారు. బాధితులు అపస్మారక స్థితిలోకి వెళ్లగా... భయపడిన నిందితులు అక్కడి నుంచి పారిపోయారు.