బంగాల్లో ప్రస్తుత పరిస్థితులు కశ్మీర్ కన్నా దారుణంగా ఉన్నాయని ఆ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు దిలీప్ ఘోష్ ఆరోపించారు. బంగాల్ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నార్త్ 24 పరగణాల జిల్లాలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరైన దిలీప్.. ఈ మేరకు వ్యాఖ్యానించారు.
"బంగాల్ ఉగ్రవాదులకు నిలయంగా మారింది. ఉత్తర బంగాల్లోని అయిపుర్దార్లో ఇటీవలే ఆరుగురు ఉగ్రవాదులను అరెస్టు చేశారు అధికారులు. రాష్ట్రంలో పలు టెర్రరిస్టు ముఠాలు తయారయ్యాయి. ఈ ప్రాంతంలో ఉగ్రవాదులు ఎక్కువగా ఉన్నారని ఇటీవలే బంగ్లాదేశ్ నాయకుడు ఖలేదా జియా కూడా ఆరోపించారు. ప్రస్తుతం ఈ ప్రాంతం కశ్మీర్ కన్నా దారుణంగా ఉంది".
- దిలీప్ ఘోష్, బంగాల్ భాజపా అధ్యక్షుడు.