తెలంగాణ

telangana

ETV Bharat / bharat

డిసెంబర్ 7 నుంచి పార్లమెంట్ శీతాకాల​ సమావేశాలు.. - పార్లమెంట్​ శీతాకాల సమావేశాల తేదీలు

Parliament Winter Session: పార్లమెంటు శీతాకాల సమావేశాలు డిసెంబర్ 7 నుంచి 29 తేదీ వరకు జరగనున్నాయి. లోక్​సభ, రాజ్యసభ సచివాలయాలు ఈమేరకు నోటిఫికేషన్లు జారీ చేశాయి.

parliament winter sessions
parliament winter sessions

By

Published : Nov 19, 2022, 9:10 AM IST

Updated : Nov 19, 2022, 9:46 AM IST

Parliament Winter Session: పార్లమెంట్​ శీతాకాల సమావేశాలు వచ్చే నెల7న ప్రారంభం కానున్నాయి. 23 రోజులపాటు జరగనున్న పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు 29 తేదీన ముగుస్తాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. మొత్తం 17 సిట్టింగ్​లలో ఉభయ సభల సమావేశాలు జరగనున్నాయని ఆయన తెలిపారు.

శాసనసభ వ్యవహారాలతో పాటు ఇతర అంశాలపై చర్చలు జరగనున్నాయని తెలిపారు. రాజ్యసభ ఛైర్మన్‌గా ఉన్న ఉపరాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌ఖడ్ ఎగువసభలో కార్యకలాపాలను నిర్వహించనున్న తొలి సెషన్‌ ఇది. అయితే సిట్టింగ్‌ సభ్యుల మృతి నేపథ్యంలో తొలిరోజు సభ వాయిదా పడే అవకాశం ఉంది.

Last Updated : Nov 19, 2022, 9:46 AM IST

ABOUT THE AUTHOR

...view details