Winter season in Leh ladakh: రోజురోజుకూ పడిపోతున్న ఉష్ణోగ్రతలతో కేంద్ర పాలిత ప్రాంతం లద్దాఖ్‌లోని లేహ్ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాధారణ రోజుల్లోనే లేహ్‌లో.. అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. శీతాకాలం కావడం వల్ల మరింత దిగజారి మైనస్ స్థాయికి పడిపోయాయి. ఫలితంగా గజగజ వణికించే చలితో లేహ్‌వాసుల కష్టాలు రెట్టింపు అయ్యాయి. గడ్డకట్టించే చలితో లేహ్‌లో జనజీవనం స్తంభించిపోతోంది.
పడిపోతున్న ఉష్ణోగ్రతల కారణంగా నదుల్లోని నీరు గడ్డకడుతోంది. పలు చోట్ల చిన్ననీటి జలనవరులు పూర్తిగా మంచుగడ్డలుగా మారిపోయాయి. ప్రజలకు ప్రభుత్వం సరఫరా చేసే నల్లా నీరు సైతం గడ్డకడుతోంది. ఫలితంగా మంచినీరు కావాలంటే నల్లాలను వేడిచేస్తేనే లభ్యమయ్యే పరిస్థితి లేహ్‌లో నెలకొంది.