Winter Fest at Ramoji Film City 2023 :ప్రపంచ ప్రఖ్యాతిగాంచినరామోజీ ఫిల్మ్‌సిటీలో శీతాకాల సంబరాలకు తెరలేవనుంది. 45 రోజుల పాటు జరిగే వింటర్ ఫెస్ట్(Winter Fest) పర్యాటకులను విశేషంగా ఆకట్టుకోనుంది. ఈ నెల 15 నుంచి ప్రారంభంకానున్న వేడుకలు జనవరి 28 వరకు కొనసాగనున్నాయి. ఈ కార్నివాల్‌ను ఎంజాయ్ చేయడానికి ఫిల్మ్‌సిటీ, పర్యాటకులకు ప్రత్యేక ప్యాకేజీలు అందుబాటులోకి తీసుకొచ్చింది.
Ramoji Film City Winter Carnival 2023 :45 రోజులు కొనసాగే ఈ ఫెస్ట్‌లో పర్యాటకుల్లో శీతాకాలపు ఉత్సాహాన్ని నింపేందుకు ప్రత్యేక వినోదాలు, సరదా కార్యక్రమాలు, లైవ్ షోలు, థ్రిల్లింగ్ రైడ్‌లు, ఆటలతో పాటు ఆబాలగోపాలాన్ని ఆకట్టుకొనే బర్డ్ పార్కు, బటర్‌ఫ్లై పార్కు, బాహుబలి సెట్‌లు, ఇంకా మరెన్నో విశేషాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు పర్యాటకులు ఈ ఫెస్ట్‌ను ఆస్వాదించవచేలా వీలు ఉంటుంది. కార్నివాల్ పరేడ్, సాయంత్రం విద్యుత్ దీపాల ధగధగల మధ్య వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
ట్రావెల్ ట్రేడ్ షోలో.. ఆకట్టుకుంటున్న రామోజీ ఫిల్మ్‌సిటీ స్టాల్
భారతీయ సినిమాకి పట్టం : భారతీయ సినిమా 110వ వార్షికోత్సవాన్ని జరుపుకొంటున్న సందర్భంగా సినిమా రంగం సాగించిన అద్భుత ప్రయాణ నేపథ్యంగా రూపుదిద్దుకున్న పాటలు, నృత్యాలు మరింత వినోదాన్ని అందిస్తాయి.
మిరుమిట్లు గొలిపేలా అందాలు : ఫిల్మ్‌సిటీలోని తోటలు, మహల్లు, కట్టడాలు, మార్గాలను మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీపాలతో అలంకరించడం అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారైనా కనులారా ఆ దృశ్యాన్ని వీక్షించాలి అన్నంతగా మంత్రముగ్ధుల్ని చేస్తాయి.