విడుదల అయిన తర్వాత పేదల సంక్షేమానికి కృషి చేస్తానని.. తనకు చెడ్డపేరు తెచ్చే పనులు చేయబోనని, చెడు మార్గంలో వెళ్లనని బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కుమారుడు (Shahrukh Khan Son News Today) ఆర్యన్ ఖాన్ శనివారం ఎన్సీబీ అధికారులకు హామీ ఇచ్చాడు. ఈ నెల 2న ఓ క్రూయిజ్ నౌకలో మాదకద్రవ్యాలను (Drug Case News) స్వాధీనం చేసుకున్న కేసులో ఆర్యన్ను ఎన్సీబీ అరెస్ట్ చేసింది. ఈ మేరకు ముంబయిలోని ఓ జైలులో అధికారులు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్యన్ వివిధ అంశాలపై మాట్లాడినట్లు అధికారులు తెలిపారు.
పేదల కోసం పని చేస్తా... చెడు మార్గంలో వెళ్లను..!
బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కుమారుడు (Shahrukh Khan Son News Today) ఆర్యన్ ఖాన్కు పోలీసులు శనివారం కౌన్సిలింగ్ ఇచ్చారు. దీనిని ముంబయిలోని ఓ జైలులో నిర్వహించారు. ఈ క్రమంలో మాట్లాడిన ఆర్యన్.. పేదల సంక్షేమం కోసం పని చేస్తానని చెప్పినట్లు అధికారులు తెలిపారు.
ఆర్యన్ ఖాన్ కౌన్సిలింగ్
'పేదలు, అణగారిన వర్గాల ప్రజలకు చేయూతనిస్తా.. నన్ను చూసి గర్వపడేలా చేస్తా' అని అధికారులకు చెప్పాడు. కాగా అతని బెయిల్ వ్యాజ్యంపై ప్రత్యేక కోర్ట్ ఈ నెల 20న ఆదేశాలు ఇవ్వనుంది.
ఇదీ చూడండి:కేరళలోని ఆరు జిల్లాల్లో రెడ్ అలెర్ట్.. రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్