బ్రిటన్‌లో కొత్త రకం కరోనా వైరస్ స్ట్రేయిన్ వేగంగా వ్యాప్తి చెందుతున్న క్రమంలో మళ్లీ లాక్డౌన్ దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ క్రమంలో 2021లో భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ హాజరవుతారా? లేదా అనే సందేహాలు నెలకొన్నాయి.
గణతంత్ర వేడుకలకు 'బోరిస్' హాజరవుతారా? - Boris Johnson latest tour
యూకే కొత్త రకం కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న క్రమంలో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్.. భారత పర్యటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2021 గణతంత్ర వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరవుతారా? లేదా అనే సందేహాల నేపథ్యంలో స్పష్టత నిచ్చాయి విదేశాంగ శాఖ వర్గాలు.
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్
అయితే.. కొత్త వైరస్ ప్రభావం వల్ల బ్రిటన్ ప్రధాని జాన్సన్ పర్యటనలో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చని తెలిపాయి అధికార వర్గాలు. అలాగే.. జాన్సన్ పర్యటన యథాతథంగా కొనసాగుతుందని విదేశాంగ వర్గాలు కూడా వెల్లడించాయి.
ఇదీ చూడండి: కరోనా 'కొత్త' షాక్- బ్రిటన్‌తో కనెక్షన్ కట్