బంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా విజయం సాధించే వరకు నిద్రపోనని సువేందు అధికారి అన్నారు. కొంటాయ్లో గురువారం ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న సువేందు తృణమూల్ కాంగ్రెస్‌పై ధ్వజమెత్తారు.
"దిలీప్ ఘోష్, సువేందు చేతులు కలిపారు. ఇక మీరు వెళ్లిపోవాల్సిన సమయం వచ్చింది. కమలం వికసించే వరకు నేను నిద్రపోను. ఇది తుఫాన్ మాత్రమే. వచ్చే ఏడాది ఎన్నికలు ప్రారంభమయ్యాక సునామీ వస్తుంది. తృణమూల్ కాంగ్రెస్‌ను గద్దె దించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు."