తన రాజకీయ పార్టీ గురించి ఈ నెల 31న అన్ని వివరాలను వెల్లడిస్తానని సూపర్‌స్టార్ రజనీకాంత్ ఇప్పటికే ప్రకటించారు. ఆ క్షణం నుంచి ఆయన అభిమానులు, రాజకీయ విశ్లేషకులు రజనీ పార్టీ ప్రకటన కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇంతలో అనారోగ్యంతో రజనీ హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చేరడం.. వారిని తీవ్ర ఆందోళనకు గురిచేసింది. చికిత్స పొంది డిశ్చార్జ్ అయినప్పటికీ.. అనుకున్న సమయానికి రజనీ ప్రజల ముందుకు వస్తారా? అన్నది ఇప్పుడు సందేహంగా మారింది. ఆసుపత్రి వర్గాలు ఆయనకు ఇచ్చిన సూచనలే ఇందుకు కారణం.
పూర్తిగా విశ్రాంతి..
ఆదివారం రజనీని వైద్యులు డిశ్చార్జ్ చేసినప్పటికీ.. ఆయన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కీలక సూచనలు చేశారు. రక్తపోటును నిరంతరం పర్యవేక్షిస్తూ వారం రోజుల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలన్నారు. ఒత్తిడి పెంచే, శరీరానికి సంబంధించిన పనులకు రజనీ పూర్తిగా దూరంగా ఉండాలని పేర్కొన్నారు. అదే సమయంలో కొవిడ్-19 సోకే అవకాశాలున్న కార్యకలాపాలను సాగించవద్దని రజనీకి వైద్యులు కౌన్సిలింగ్ ఇచ్చినట్టు అపోలో హాస్పిటల్స్ ఓ ప్రకటనను విడుదల చేసింది.
మరి ఈ పరిస్థితుల్లో రజనీకాంత్ వైఖరి ఎలా ఉంటుందన్నది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. వైద్యుల సూచనలను పక్కనపెట్టి.. ఆయన పార్టీని ప్రకటించి, ముందుకు సాగుతారా? లేక పార్టీకి సంబంధించిన విషయాలను కొన్ని రోజులు వాయిదా వేస్తారా? అన్నది కీలకంగా మారింది.
ఇవీ చూడండి:-