భాజపాకు బంగాల్ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ సవాల్ విసిరారు. ఒక కుటుంబం నుంచి కేవలం ఒక్కరే రాజకీయాల్లోకి రావాలని కేంద్రంలోని అధికార భాజపా చట్టం తెస్తే వెంటనే రాజకీయాల నుంచి తాను తప్పుకుంటానని తెలిపారు.
కుల్తాలీ అసెంబ్లీ నియోజక వర్గంలో ర్యాలీ పాల్గొన్న అభిషేక్ భాజపాపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తను అవినీతికి పాల్పడినట్లు భాజపా పదేపదే ఆరోపణలు చేస్తోందని, వాటిని గనుక నిరూపిస్తే బహిరంగంగా ఉరేసుకుని చనిపోతానని అన్నారు.
తమది కుటుంబ పాలన కాదని భాజపా పదే పదే చెబుతోంది. భాజపా నేతలు.. కైలాస్ విజయ వర్గీయ నుంచి సువేందు అధికారి వరకు, ముకుల్ రాయ్ నుంచి రాజ్నాథ్ సింగ్ వరకు వారి కుటుంబంలో ఒకరి కంటే ఎక్కువ మంది రాజకీయాల్లో ఉన్నారు. కుటుంబం నుంచి ఒక్కరే రాజకీయాల్లోకి రావాలని కేంద్రం చట్టం చేస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటా. మా కుటుంబం నుంచి మమతా బెనర్జీ ఒక్కరే రాజకీయాల్లో ఉంటారు.