కరోనా నిరోధానికి ఉచితంగా టీకా ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం ఒకవేళ విఫలమైతే తామే ప్రజలకు అందిస్తామని దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అన్నారు. ఉచితంగా వ్యాక్సిన్ పంపిణీ కోసం ఇప్పటికే తాము కేంద్రాన్ని అభ్యర్థించామని, ఈ టీకా డోసుల ఖర్చును భరించలేని వారెందరో ఈ దేశంలో ఉన్నారన్నారు. దీనిపై కేంద్రం ఏం చేస్తుందో చూడాల్సి ఉందన్నారు.
ఉచితంగా టీకా ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైతే.. అవసరమైతే తామే ఇస్తామని విలేకర్లతో అన్నారు. కరోనా విధుల్లో ఉండి వైరస్ సోకడంతో మరణించిన వైద్యుడు హితేశ్ గుప్తా కుటుంబాన్ని సీఎం పరామర్శించారు. ఆ కుటుంబానికి రూ.కోటి అందజేశారు. వైద్యుడి భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు.