లాక్డౌన్ కారణంగా నగరాల్లో ఇరుక్కున్న వలస కార్మికుల కోసం ముఖ్యమైన ప్రాంతాల్లో సామాజిక వంటశాలలను ఏర్పాటు చేయాలని కేంద్రంతో పాటు దిల్లీ, హరియాణా, ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వాలను సుప్రీం కోర్టు ఆదేశించింది. లాక్డౌన్ నేపథ్యంలో వలస కార్మికుల కోసం చేపట్టిన చర్యలు, రవాణా సౌకర్యాలు, ఆహార భద్రత తదితర అంశాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గదర్శకాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం ధర్మాసనం విచారణ చేపట్టింది.
రేషన్ ఇవ్వండి..