తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'నేను బతికున్నంత వరకు భాజపాతో పొత్తు పెట్టుకోను' - లాలూ దాణా కుంభకోణం

భాజపాపై బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ మరోసారి విమర్శలు గుప్పించారు. తాను బతికున్నంత వరకు భాజపాతో పొత్తు పెట్టుకోనని తేల్చి చెప్పారు. ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ వంటి రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకునేందుకు దర్యాప్తు సంస్థలను భాజపా వినియోగించుకుంటోందని విరుచుకుపడ్డారు.

nitish kumar on bjp
నీతీశ్ కుమార్

By

Published : Oct 14, 2022, 10:25 PM IST

Nitish Kumar On Bjp : అధికారం కోసం కూటములు మారుస్తారంటూ తనపై భాజపా విమర్శలు చేస్తున్న వేళ జేడీయూ అధినేత, బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను బతికున్నంత వరకు మళ్లీ భాజపాతో పొత్తు పెట్టుకోబోనని తేల్చి చెప్పారు. ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ వంటి రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకునేందుకు దర్యాప్తు సంస్థలను భాజపా వినియోగించుకుంటోందని దుయ్యబట్టారు. ఉత్తర బిహార్‌లోని ఓ జిల్లాలో ప్రభుత్వ ఇంజినీరింగ్‌ కళాశాల ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన.. భాజపా అగ్రనాయకత్వం అహంకారంతో కూడుకున్నదంటూ విరుచుకుపడ్డారు.

'లాలూపై కేసులు నమోదు చేయడంతో వారితో సంబంధాలు తెంచుకున్నాను. కానీ ఇప్పుడు మేం మళ్లీ కలిసిపోయిన నేపథ్యంలో వాళ్లు మళ్లీ కొత్తగా కేసులు పెడుతున్నారు. వారి తీరు ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు' అంటూ భాజపా పేరును ప్రస్తావించకుండా నీతీశ్‌ కుమార్‌ కేంద్ర ప్రభుత్వంపై పరోక్షంగా మండిపడ్డారు. ఒకే పార్టీకి చెందిన నేతలు భిన్నవిధాలుగా ఉన్నారన్న ఆయన.. మాజీ ప్రధాని వాజ్‌పేయీ, ఎల్‌కే అడ్వాణీ, మురళీ మనోహర్‌ జోషీ వంటి నేతలతో తనకున్న సత్సంబంధాలను గుర్తుచేసుకున్నారు. వీరికి విరుద్ధంగా ప్రస్తుతం అధికారంలో ఉన్నవారు మాత్రం ఎవ్వరికీ వినరని.. ఎవ్వరికీ గౌరవం కూడా ఇవ్వరంటూ భాజపా అధినాయకత్వంపై విమర్శలు గుప్పించారు.

ABOUT THE AUTHOR

...view details