తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఇకపై ఆర్​ఎస్​ఎస్​ను 'సంఘ్​ పరివార్​' అని పిలవను' - RSS impact in UP incident

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్​ను ఇకపై 'సంఘ్​ పరివార్'గా పిలవనని చెప్పారు కాంగ్రెస్​నేత రాహుల్ గాంధీ. యూపీలో.. కేరళకు చెందిన క్రైస్తవ సన్యాసినులను భజరంగ్​దళ్​ కార్యకర్తలు వేధించారన్న ఆరోపణల నేపథ్యంలో రాహుల్ ఈ విధంగా ట్వీట్ చేశారు.

Will no longer call RSS 'Sangh Parivar' it's a misnomer: Rahul
'ఇకపై ఆర్​ఎస్​ఎస్​ను 'సంఘ్​ పరివార్​' అని పిలవను'

By

Published : Mar 25, 2021, 12:50 PM IST

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్​ను 'సంఘ్​ పరివార్​'గా సంబోధించనని అన్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. కుటుంబంలో పెద్దలను, స్త్రీలను గౌరవించాలని.. అవి సంఘ్​లో లేవని ఆరోపించారు. ఉత్తర్​ప్రదేశ్​ ఝాన్సీలో కేరళకు చెందిన క్రైస్తవ సన్యాసినుల(నన్​ల)ను భజరంగ్​ దళ్​ కార్యకర్తలు ​వేధించారన్న ఆరోపణల నేపథ్యంలో రాహుల్​ ట్వీట్​కు ప్రాధాన్యం సంతరించుకుంది.

"ఆర్​ఎస్​ఎస్​ను, దాని​ అనుబంధ సంఘాలను 'సంఘ్​ పరివార్​' అని పిలవడం సరికాదు. కుటుంబంలో మహిళలకు, కుటంబ పెద్దలకు గౌరవం ఇవ్వడం ఆనవాయితీ. ఇలాంటివి ఆర్​ఎస్​ఎస్​లో లేవు."

-- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత.

ఈ ఘటనపై ఇతర నేతలు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:ఉత్తర్​ప్రదేశ్​లో మహిళపై అత్యాచారం

ABOUT THE AUTHOR

...view details