"జాతీయ స్థాయిలో మోదీకి ప్రత్యామ్నాయంగా దీదీ"... బంగాల్ శాసనసభ ఎన్నికల ఫలితాల తర్వాత విస్తృత చర్చ జరిగింది ఈ అంశంపైనే. అందుకు తగ్గట్టే జాతీయ ఆకాంక్షలను, అందుకు అనుసరించే ప్రణాళికలను బయట పెట్టింది తృణమూల్ కాంగ్రెస్. జాతీయ రాజకీయాల్లో సీనియర్ నేత ముకుల్ రాయ్‌కు ఉన్న అనుభవాన్ని ఆసరాగా చేసుకుని... ఈ వ్యూహాలను అమలు చేయాలని భావిస్తోంది టీఎంసీ. భాజపాను వీడి కొద్ది రోజుల క్రితమే తృణమూల్ కాంగ్రెస్‌లోకి తిరిగొచ్చారాయన.
టీఎంసీ జాతీయ ఆకాంక్షలపై చర్చ నేపథ్యంలో... ముకుల్ రాయ్, టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ మధ్య శనివారం జరిగిన భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సమావేశంలో చర్చించిన విషయాలు బయటకు రాకపోయినా.. దిల్లీ రాజకీయాలకు సంబంధించి ప్రధానంగా మూడు అంశాలపై చర్చించినట్లు తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు తెలిపారు.
ఇదీ చదవండి :'దేశవ్యాప్తంగా టీఎంసీ- భాజపా ఉన్న చోట్ల పోటీ'
ముకుల్ తర్వాత వచ్చేదెవరు?
ముకుల్ రాయ్.. టీఎంసీ గూటికి తిరిగి చేరిన తర్వాత చాలామంది భాజపా నాయకులు, ముఖ్యంగా ముకుల్‌కు ఆప్తులు, సన్నిహితంగా ఉన్నవారు తృణమూల్ కాంగ్రెస్‌లో చేరేందుకు మొగ్గుచూపుతున్నారు. అయితే వీరిలో ఎవరిని పార్టీలోకి ఆహ్వానించాలి? అన్నదానిపై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.
ఇదీ చదవండి :టీఎంసీలోకి తిరిగొచ్చిన ముకుల్ రాయ్
జాతీయ స్థాయిలో ముకుల్ పాత్ర..