పౌరసత్వ సవరణ చట్టా(సీఏఏ)న్ని భాజపా ఒక రాజకీయ ఆయుధంగా వాడుకుంటోందని కాంగ్రెస్ నాయకుడు, దివంగత తరుణ్ గొగొయ్ తనయుడు గౌరవ్ గొగొయ్(38) ఆరోపించారు. సమాజాన్ని విభజించడానికే దీన్ని ఉపయోగిస్తోందని అన్నారు. అసోంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దీన్ని అమలు కానీయబోమని చెప్పారు. సీఏఏను వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుప్రీం కోర్టులో వాదనలు కూడా వినిపిస్తామని తెలిపారు. అసోం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన ఓ వార్తా సంస్థతో మాట్లాడారు.
'మేం అధికారంలోకి వస్తే సీఏఏ మూలకే'
పౌరసత్వ సవరణ చట్టాన్ని ఒక రాజకీయాస్త్రంగా భాజపా వాడుకుంటోందని ఆరోపించారు కాంగ్రెస్ నేత గౌరవ్ గొగొయ్. అసోంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే ఈ చట్టాన్ని అమలు కానీయబోమని చెప్పారు.
'మేం అధికారంలోకి వస్తే సీఏఏ మూలకే'
గతంలో కుదిరిన అసోం ఒప్పందంలో ఎవరు పౌరులు, ఎవరు కాదు అన్న విషయంలో స్పష్టత ఉందని, దాని ప్రకారమే చర్యలు తీసుకుంటామని గౌరవ్ గొగొయ్ చెప్పారు. కాంగ్రెస్ గెలిస్తే ముఖ్యమంత్రి పదవి ఆశిస్తున్నారా అని ప్రశ్నించగా అలాంటిదేమీ లేదని అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ నాయకులంతా కలిసికట్టుగా ప్రచారం చేస్తున్నామని తెలిపారు.
ఇదీ చూడండి:అభ్యర్థుల ఎంపిక కోసం నేడు భాజపా సీఈసీ భేటీ