త్రివర్ణ పతాకంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ఎట్టకేలకు వెనక్కితగ్గారు. జమ్ముకశ్మీర్ జెండాతో పాటు జాతీయ పతాకాన్ని ఎగురవేస్తామన్నారు. అయితే జమ్ముకశ్మీర్ రాజ్యాంగం, సార్వభౌమాధికారం, జాతీయ సమగ్రతను ఒకదాని నుంచి మరొకటి విడదీయలేమన్నారు.
"వేలమంది కార్యకర్తలు, ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి ఇన్నాళ్లూ జాతీయ జెండాను భూజాన మోసాం. అయితే నిక్కర్లు (ఆర్ఎస్స్ను ఉద్దేశించి) వేసుకునే కొంత మంది నేతలు వారి కార్యాలయాల్లో ఏనాడూ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయలేదు. అలాంటి వాళ్లు జెండా గురించి మాకు పాఠాలు చెబుతున్నారు."
- మెహబూబా ముఫ్తీ, జమ్ముకశ్మీర్ మాజీ సీఎం
దేశంతో జమ్ముకశ్మీర్‌కు ఉన్న బంధాల్ని ఆర్టికల్ 370 రద్దుతో కేంద్రం తెంచే ప్రయత్నాలు చేసిందని ముఫ్తీ ఆరోపించారు. ముందు తమ జమ్ముకశ్మీర్ జెండాను తమకు తిరిగి ఇవ్వాలని ముఫ్తీ డిమాండ్ చేశారు.