తెలంగాణ

telangana

'మే1న టీకాలు అందకపోతే​ రాజీనామా చేస్తారా?'

మే 1 నుంచి కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్​కు పరీక్షా సమయం ప్రారంభమవుతుందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం. టీకా పంపిణీ కేంద్రాల వద్ద వ్యాక్సిన్​ లేవన్న కారణంతో ప్రజలు మరలివెళ్తే హర్షవర్ధన్​ రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు.

By

Published : Apr 30, 2021, 4:50 AM IST

Published : Apr 30, 2021, 4:50 AM IST

chidambaram
'టీకాలు లేకపోతే హర్షవర్ధన్​ రాజీనామా చేస్తారా?'

కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్​కు మే 1వ తేదీ నుంచి పరీక్షా కాలం మొదలవుతుందని కాంగ్రెస్​ సీనియర్​ నేత పి.చిదంబరం వ్యాఖ్యానించారు. వ్యాక్సిన్​ కేంద్రాల వద్ద టీకాలు లేవన్న కారణంతో ప్రజలు మరలిపోతే.. హర్షవర్ధన్​ రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు. ఏ ఒక్క రాష్ట్రం కూడా మే 1 నుంచి 18 ఏళ్లు దాటిన వారికి టీకా అందించేందుకు సిద్ధంగా లేదని ట్విట్టర్​ వేదికగా ఆరోపించారు.

"మే 1 నుంచి కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్​కు పరీక్షా కాలం మొదలవుతుంది. రాష్ట్రాల్లో వ్యాక్సిన్​ నిల్వలు పుష్కలంగా ఆయన, ఆయన ప్రభుత్వమూ వాదిస్తోంది. 18 నుంచి 44 ఏళ్ల మధ్య వయస్కులకు వ్యాక్సినేషన్​ అందించేందుకు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా సిద్ధంగా లేదు. కొవిన్​ యాప్​ కూడా పనిచేయటం లేదు. మే 1 నుంచి టీకాలు లేవన్న కారణంతో వ్యాక్సినేషన్​ కేంద్రాల నుంచి ప్రజలు మరలి వెళ్తే.. ఆరోగ్యమంత్రి రాజీనామా చేస్తారా?

- పి.చిదంబరం, కాంగ్రెస్​ సీనియర్​ నేత.

మరోవైపు... వ్యాక్సిన్​ తయారీ దారుల నుంచి టీకాలను కేంద్రం పొందుతున్న ధరకే రాష్ట్రాలకు కూడా అందించాలని కాంగ్రెస్​ డిమాండ్​ చేస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్​ పాలిత ప్రాంతాలు మే1 నుంచి 18 ఏళ్ల వారికి వ్యాక్సినేషన్​ అందించడానికి సిద్ధంగా లేమని తెలిపాయి.

ఇదీ చూడండి:మహారాష్ట్రలో ఒక్కరోజే 66,159 మందికి కరోనా

ఇదీ చూడండి:హోం ఐసోలేషన్ కొత్త మార్గదర్శకాలు ఇవే!

ABOUT THE AUTHOR

...view details