తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నేను గెలిస్తే ప్రతి ఆడపిల్లకు రూ.లక్ష: ఖుష్బూ - థౌజండ్​లైట్స్​ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న కుష్బూ

తమిళనాడు థౌజండ్ లైట్స్​ నియోజకవర్గం నుంచి తాను శాసనసభ్యురాలిగా గెలిస్తే ప్రతి ఆడపిల్ల ఖాతాలో లక్ష రూపాయలు జమ చేస్తానని వాగ్దానం చేశారు భాజపా అభ్యర్థి ఖుష్బూ. శనివారం కేంద్ర మంత్రి స్మృతి ఇరానీతో కలిసి ఆమె ప్రచారం నిర్వహించారు.

BJP's Khushbu Sundar
తమిళనాడులో భాజపా నేత కుష్బూసుందర్ ఎన్నికల​ ప్రచారం

By

Published : Mar 28, 2021, 10:33 AM IST

తాను ఎమ్మెల్యేగా గెలిస్తే ప్రతి ఆడపిల్ల బ్యాంకు ఖాతాలో రూ.లక్ష వేస్తానని హామీ ఇచ్చారు భాజపా నేత ఖుష్బూ సుందర్​. పురిటిలోనే ఆడ పిల్లను చంపే ధోరణిని ఆపాలని పిలుపునిచ్చారు. తమిళనాడు థౌజండ్ లైట్స్​ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఆమె... శనివారం ప్రచారంలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, భాజపా నేత ఖుష్బూ
ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, భాజపా నేత ఖుష్బూ
ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, భాజపా నేత ఖుష్బూ
ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, భాజపా నేత ఖుష్బూ

"ప్రతి మహిళ ఆర్థికంగా స్వతంత్రంగా ఉండడం ఎంతో అవసరం. ఆడ పిల్ల పుట్టగానే చిన్నారి పేరిట రూ. లక్ష ఖాతాలో వేస్తాను. ఆమె స్వతంత్రంగా ఎదగడానికి ఈ డబ్బు సాయపడుతుంది."

-ఖుష్బూ సుందర్​, థౌజండ్​లైట్స్​ నియోజకవర్గ భాజపా అభ్యర్థి

తమిళనాడులో ఏప్రిల్ ​6న పోలింగ్ జరుగనుంది. మే 2న ఫలితం వెలువడనుంది.

ఇదీ చూడండి:కుష్బూ దోశలు- స్మృతి దాండియా స్టెప్పులు

ABOUT THE AUTHOR

...view details