తెలంగాణ

telangana

ETV Bharat / bharat

2021 ఎన్నికల బరిలో కమల్​ హాసన్​

తమిళనాడులో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు మక్కల్​ నీది మయ్యమ్​ పార్టీ అధినేత, ప్రముఖ నటుడు కమల్​ హాసన్​. తమ పార్టీ ఇప్పటికే అభ్యర్థుల ఎంపికను ప్రారంభించిందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాలని రజనీకాంత్​ను కోరనున్నట్లు చెప్పారు.

Kamal Haasan
కమల్​ హాసన్​

By

Published : Nov 5, 2020, 9:27 PM IST

ప్రముఖ సినీ నటుడు, మక్కల్​ నీది మయ్యమ్​(ఎంఎన్ఎం) పార్టీ అధినేత కమల్​ హాసన్​ ఎన్నికల బరిలో నిలవనున్నట్లు వెల్లడించారు. 2021లో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు.

చెన్నైలో నిర్వహించిన మీడియా సమావేశంలో.. ఎన్నికల కోసం రజనీకాంత్​ మద్దతు కోరనున్నట్టు వెల్లడించారు కమల్​.

"రాజకీయాలపై ప్రముఖ హీరో రజనీకాంత్​తో చర్చలు జరుపుతున్నాం. వచ్చే ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాలని ఆయనను కోరనున్నాం. అయితే.. రాజకీయాల్లోకి రావాలనుకునే ముందు ఆయన ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం. మక్కల్​ నీది మయ్యమ్​లో నిందా రాజకీయాలు, ప్రతీకార రాజకీయాలు ఉండవు. మార్గదర్శక రాజకీయాలు మాత్రమే ఉంటాయి. అసెంబ్లీ ఎన్నికల కోసం తగిన అభ్యర్థులను ఎంపిక చేసే ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించాం."

- కమల్​ హాసన్​, మక్కల్​ నీది మయ్యమ్​ అధినేత.

తమిళనాడులో ప్రధాన పార్టీలైన డీఎంకే, ఎండీఎంకే మధ్య వచ్చే ఎన్నికల్లో హోరాహోరీ పోరు నెలకొనే అవకాశం ఉంది. అయితే.. ఇప్పటినుంచే కసరత్తును ప్రారంభించారు కమల్​ హాసన్​. పార్టీ కార్యకర్తలు, నేతలతో భేటీ అవుతూ దిశానిర్దేశం చేస్తున్నారు.

ఇదీ చూడండి:రాజకీయ పొత్తులపై కమల్​ పార్టీ స్పష్టత

ABOUT THE AUTHOR

...view details