తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Wife Sells Husband To Another Woman : రూ.5లక్షలకు భర్తను అమ్మేసిన భార్య.. వేరే మహిళతో చనువుగా ఉంటున్నాడని.. - 5 లక్షలకు భర్తను విక్రయించిన భార్య

Wife Sells Husband To Another Woman For Rs 5 Lakhs : భర్తను రూ.5లక్షలకు మరో మహిళకు విక్రయించింది ఓ భార్య. భర్త వేరే మహిళతో చనువుగా ఉండటాన్ని చూసి ఇలా చేసింది. కర్ణాటకలో ఈ ఘటన జరిగింది.

Woman Sells Husband To Another Woman For Rs 5 Lakhs in karnataka
భర్తను వేరే మహిళ అమ్మేసిన భార్య

By ETV Bharat Telugu Team

Published : Oct 22, 2023, 2:08 PM IST

Wife Sells Husband To Another Woman For Rs 5 Lakhs : ఓ తెలుగు సినిమాలో​ భర్తను.. రూ.కోటికి మరో మహిళకు విక్రయిస్తుంది హీరోయిన్​. సరిగ్గా అలాంటి ఘటనే నిజ జీవితంలోనూ జరిగింది. తన భర్తను రూ.5 లక్షలకు మరో మహిళకు అమ్మేసింది ఓ భార్య. కర్ణాటకలో ఈ ఘటన జరిగింది. ఈ సందర్భంగా మహిళలిద్దరూ కుదుర్చుకున్న రాజీ ఒప్పందం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

వివరాల్లోకి వెళ్తే...
మండ్య సమీప గ్రామానికి చెందిన ఓ వ్యక్తి.. స్థానికంగా ఉండే మహిళతో సన్నిహితంగా ఉంటున్నాడు. దీన్ని అతని భార్య గుర్తించింది. ఈ విషయంపై భర్తను, సదరు మహిళను నిలదీసింది. అనంతరం ఆడవాళ్లిద్దరి మధ్య గొడవ జరిగింది. చివరకు ఆ వివాదం గ్రామ పంచాయితీకి చేరింది.

"నీ భర్త నా దగ్గర రూ.5 లక్షలు తీసుకున్నాడు. ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించి.. నీ భర్తను తీసుకువెళ్లు" అని పంచాయతీలో అతని భార్యకు తేల్చిచెప్పింది మహిళ. అయితే, ఈ ప్రతిపాదనకు అతడి భార్య నిరాకరించింది. అలాంటి భర్త తనకేమివద్దని, తనకే రూ.5 లక్షల మనోవర్తి ఇచ్చి అతడ్ని ఉంచేసుకోవాలని ఆ మహిళకు సూచించింది ఇల్లాలు. దీనికి ఇద్దరు మహిళలు అంగీకరించారు. ఒప్పుకున్న నగదును ఇచ్చేందుకు ఇల్లాలిని ఒక నెల గడువు అడిగింది మహిళ. అందుకు ఆ గృహిణి కూడా అంగీకరించింది. వీరిద్దరూ కుదుర్చుకున్న ఈ రాజీ ఒప్పందంతో పంచాయితీ ప్రతినిధులు, గ్రామస్థులు అవాక్కయ్యారు.

భర్తకు రెండో పెళ్లి జరిపించిన భార్య..
Wife Cheating Case on Husband :కొద్ది రోజుల క్రితం హైదరాబాద్​లోనూ ఇలాంటి వింత ఘటన జరిగింది. కొంత కాలం క్రితమే ఓ యువకుడ్ని పెళ్లి చేసుకున్న ఓ యువతి.. అతడు కోరుకున్న మరో యువతితో దగ్గరుండి మరో పెళ్లి చేయించింది. అయితే ఈ విషయం యువకుడి రెండో భార్యకు తెలియదు. పెళ్లి తర్వాత భర్త ప్రవర్తనతో అయోమయానికి గురైంది ఆ యువతి. అతనెందుకు అలా ప్రవర్తిస్తున్నాడో తెలిశాక ఆందోళన చెందింది. అసలు విషయం తెలుసుకుని పోలీసులను ఆశ్రయించింది. రంగంలోకి దిగిన పోలీసులు అసలు ట్విస్ట్ తెలుసుకుని షాక్ అయ్యారు. ఆ ట్విస్ట్ ఏంటే తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

Wife Complaint Against Husband : 'ఫ్రెండ్స్​తో సెక్స్​ చేయమని భర్త ఒత్తిడి.. ఆ​ సీక్రెట్స్ షేర్​.. అడిగితే చంపేస్తానంటూ..'

Old Man United With Family : భార్యతో గొడవపడి ఇంటి నుంచి బయటకు.. 10ఏళ్ల పాటు భిక్షాటన చేస్తూ జీవనం.. రూ.50వేలు సంపాదించి..

ABOUT THE AUTHOR

...view details