తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కోడికూర వండలేదని.. భార్యను నరికి చంపిన భర్త - wife murder for chicken curry

Wife Murdered For Chicken Curry: కుమార్తె పుట్టినరోజున కోడి కూర వండలేదని మద్యం మత్తులో ఉన్న ఓ భర్త.. తన భార్యను కొడవలితో నరికి చంపాడు. తీరా మద్యం మత్తు దిగాక చేసిన తప్పును ఒప్పుకుని పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఈ దారుణ ఘటన కర్ణాటకలో జరిగింది.

Wife Murdered For Chicken Curry
Wife Murdered For Chicken Curry

By

Published : Jun 11, 2022, 7:33 AM IST

Updated : Jun 11, 2022, 7:57 AM IST

Wife Murdered For Chicken Curry: కుమార్తె పుట్టిన రోజున చికెన్‌ చేయలేదనే ఆగ్రహంతో కొడవలితో భార్యను హతమార్చాడు. ఈ దుర్ఘటన కర్ణాటకలో వెలుగు చూసింది. మృతురాలిని షీలాగా (28) గుర్తించారు. భార్యను హతమార్చిన భర్తకు మద్యం మత్తు దిగిపోయాక చేసిన తప్పును గుర్తించి పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు.

కెంచప్ప, షీలా

ఏం జరిగిందంటే?.. కర్ణాటకలోని దావణగెరె జిల్లా హరిహర తాలూకా బన్నికోడు గ్రామానికి చెందిన కెంచప్ప- షీలా దంపతులు. ఎనిమిదేళ్ల కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి కుమార్తె సంతానం. కొంతకాలంగా భార్య ప్రవర్తనపై కెంచప్పకు అనేక సందేహాలుండేవని సమాచారం. ఈ కారణంగానే తరచు ఇద్దరూ గొడపడేవారు. ఇరు కుటుంబాల పెద్దలు రాజీకుదిర్చారు. భర్త వేధింపులను తాళలేక షీలా కొన్నాళ్లపాటు పుట్టింటికి వెళ్లింది. బుధవారం రాత్రి కుమార్తె జన్మదిన వేడుకల సందర్భంగా పుట్టింటి నుంచి భర్త వద్దకు వచ్చింది. కుమార్తె పుట్టిన రోజున చికెన్‌ చేయాలంటూ కెంచప్ప పురమాయించాడు. ఆమె ఎందుకో ఆపని చేయలేకపోయింది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న భర్త గొడవకు దిగాడు. వాగ్వాదంతో ఆరంభమైన గొడవ ఘర్షణకు దారితీసింది. కొడవలితో ఆమెను నరికాడు. తీవ్ర గాయాలతో ఆమె కన్నుమూసింది. గురువారమంతా కనిపించని ఆ వ్యక్తి మద్యం మత్తుదిగిపోవడంతో శుక్రవారం నేరుగా పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. హరిహర గ్రామీణ పోలీసులు కేసు దర్యాప్తును చేపట్టారు.

Last Updated : Jun 11, 2022, 7:57 AM IST

ABOUT THE AUTHOR

...view details