తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్రియుడి మోజులో భర్తను చంపిన భార్య.. గొడ్డలితో ఐదు ముక్కలుగా నరికి.. - గొడ్డలితో భర్తను నరికి చంపిన భార్య పీలీభీత్

Wife Kills Husband With Axe : ప్రియుడి మోజులో పడి ఓ భార్య.. భర్తను కిరాతకంగా గొడ్డలితో నరికి చంపింది. అనంతరం మృతదేహాన్ని ఐదు ముక్కలుగా చేసి.. కాలువలో పడేసింది. మృతుడి కుమారుడు.. తన తండ్రి అదృశ్యమయ్యాడని పోలీసులకు ఫిర్యాదు చేయడం వల్ల అసలు విషయం బయటపడింది. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే?

Wife Kills Husband With Axe
Wife Kills Husband With Axe

By

Published : Jul 28, 2023, 8:49 AM IST

Updated : Jul 28, 2023, 9:16 AM IST

Wife Kills Husband With Axe : ఉత్తర్​ప్రదేశ్​.. పీలీభీత్​ జిల్లాలో దారుణం జరిగింది. ప్రియుడి మోజులో పడి ఓ మహిళ తన భర్తను గొడ్డలితో నరికి చంపి అడ్డు తొలగించుకుంది. మృతదేహాన్ని పడేసేందుకు వీలుగా ఐదు ముక్కలుగా నరికింది. వాటిని గోనె సంచిలో వేసి.. కాలువలో విసిరేసింది. తన తండ్రి కనిపించకపోవడం వల్ల మృతుడి కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో.. నిందితురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల ఎదుట నిందితురాలు నేరాన్ని అంగీకరించింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
Wife Killed Husband News : గజ్​రౌలా పోలీస్​ స్టేషన్ పరిధిలోని శివనగర్ గ్రామంలో రాంపాల్​ (55) అనే వ్యక్తి తన భార్య దులారో దేవీ, కుమారుడు సోంపాల్​తో కలిసి నివసిస్తున్నాడు. దులారో దేవీకి వేరే యువకుడితో వివాహేతర సంబంధం ఏర్పడింది. దీనికి రాంపాల్​ అడ్డుగా మారాడు. ప్రియుడి మోజులో పడిన దులారో దేవీ.. ఎలాగైనా తన భర్తను అడ్డు తొలగించుకోవాలనుకుంది. అనుకున్నదే తడవుగా భర్త హత్యకు ప్లాన్ వేసింది. సోమవారం అర్ధరాత్రి నిద్రిస్తున్న రాంపాల్​ను గొడ్డలితో నరికి చంపింది. మృతదేహాన్ని పారేసేందుకు వీలుగా ఐదు ముక్కలు చేసింది. అనంతరం వాటిని ఒక గోనె సంచిలో వేసి.. శివనగర్​ ఆరోగ్య కేంద్రం సమీపంలోని నిగోహి బ్రాంచ్​ కెనాల్​లో పడేసింది.

అయితే.. మంగళవారం నుంచి తన తండ్రి కనిపించపోవడం వల్ల.. కుమారుడు సోంపాల్​ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతడి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. మృతుడి కుటుంబ సభ్యులతో పాటు దులారో దేవిని విచారించిన పోలీసులు.. ఆమెపై అనుమానం వ్యక్తం చేశారు. అనంతరం ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అయితే, తొలుత నేరం అంగీకరించని నిందితురాలు.. పోలీసులు తమదైన శైలిలో విచారించడం వల్ల అసలు విషయం బయటపెట్టింది. మహిళ చెప్పిన వివరాల ఆధారంగా ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసుల.. రక్తపు మరకలతో ఉన్న బట్టలను స్వాధీనం చేసుకున్నారు. మృతదేహం కోసం గజ ఈతగాళ్ల బృందం సహాయంతో కాలువలో గాలించారు. ఈ ఘటన ఘటన గురువారం వెలుగులోకి వచ్చినట్లు సర్కిల్ పోలీసు​ అధికారి అన్షు జైన్ వివరించారు.

భర్తను చంపి పాతిపెట్టిన భార్య.. ఏడాదిన్నర తర్వాత..
కేరళ.. పతనంతిట్టా జిల్లాలో ఏడాదిన్నర క్రితం అదృశ్యమైన ఓ వ్యక్తి కేసులో కీలక మలుపు తిరిగింది. మృతుడి భార్యను పోలీసులు విచారించగా.. తానే భర్తను చంపానని అంగీకరించింది. ఈ క్రమంలో నిందితురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..కలంజూర్​ ప్రాంతంలో నౌషాద్ (34), అతడి భార్య అఫ్సానా (25)తో కలిసి నివసించేవాడు. అయితే.. నౌషాద్ 2021 నవంబర్ 1 నుంచి కనిపించకుండా పోయాడు. అతడి బంధువు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉండగా పోలీసులకు అందిన రహస్య సమాచారం మేరకు.. 2023 జులై 26న అఫ్సానాను పోలీస్ స్టేషన్​కు పిలిపించి విచారించగా తన భర్తను తానే హత్య చేసి పాతిపెట్టినట్లు వాంగ్మూలం ఇచ్చింది. నౌషాద్ తాగి వచ్చి తనను కొట్టేవాడని, కుటుంబ సమస్యలే హత్యకు దారితీశాయని అఫ్సానా పోలీసులకు చెప్పింది. హత్యకు తన స్నేహితుడు కూడా సాయం చేశాడని పేర్కొంది. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితురాలిని అరెస్టు చేశారు.

Last Updated : Jul 28, 2023, 9:16 AM IST

ABOUT THE AUTHOR

...view details