తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్రియుడితో కలిసి భర్తను చంపి.. మృతదేహాన్ని డ్రమ్ములో దాచి.. - నీళ్ల డ్రమ్ములో మృతదేహం

Wife kills husband: ఓ మహిళ తన ప్రియడితో కలిసి భర్తను హత్య చేసింది. అతని మృతదేహాన్ని నీటి డ్రమ్ములో దాచిపెట్టింది. తమిళనాడులో ఈ ఘటన జరిగింది.

wife kills husband
ప్రియుడితో కలిసి భర్త హత్య

By

Published : Dec 25, 2021, 10:55 PM IST

wife kills husband: తమిళనాడులో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ మహిళ తన ప్రియడితో కలిసి భర్తను హత్య చేసింది. ఆపై అతని మృతదేహాన్ని నీటి డ్రమ్ములో దాచిపెట్టింది.

అసలేమైందంటే..?

Tamil nadu salem news: సేలం జిల్లా కిచ్చపాల్యంకు చెందిన సేతుపతి(33), ప్రియ(30) దంపతులు. వారికి ఏడేళ్ల కుమార్తె, ఓ పది నెలల వయసు బాబు ఉన్నారు. సేతుపతి బీఫ్​ షాపులో పని చేస్తుంటాడు. అతడు మద్యానికి అలవాటు పడ్డాడు. దీంతో భార్యభర్తలిద్దరికి తరుచూ గొడవలు జరుగుతుండేవి.

ప్రియ, సేతుపతి

శనివారం ప్రియ, ఆమె ప్రియుడు కలిసి ఓ నీళ్ల డ్రమ్మును ఇంటి నుంచి బయటకు తరలించేందుకు యత్నించారు. ఆ సమయంలో ఇరుగుపొరుగున ఉన్నవారికి దుర్వాసన వ్యాపించింది. దీనిపై అనుమానం వ్యక్తం చేసిన వారు.. పోలీసులకు తెలియజేశారు.

ఘటనాస్థలికి హుటాహుటిన చేరుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. దాంతో ప్రియ తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి, మృతదేహాన్ని నీళ్ల డ్రమ్ములో దాచిందని తేలింది. పోలీసులు.. ప్రియను, ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చూడండి:'డెత్​ వెల్'​లో బైక్​పై స్టంట్స్​- యువకుడికి తీవ్ర గాయాలు

ఇదీ చూడండి:ట్రిమ్మర్​లో దాచి రూ.24 లక్షల విలువైన బంగారం స్మగ్లింగ్​

ABOUT THE AUTHOR

...view details