వారిద్దరూ రోజువారి కూలీలు... అలా పనిలో పరిచయం చిగురించి.. వివాహేతర సంబంధంగా మారింది. కానీ ఆ మహిళకు ఇదివరకే పెళ్లై ఓ కుమారుడు కూడా ఉన్నాడు. ప్రియుడితో కలిసుండాలంటే భర్తను అడ్డు తొలగించుకోవాలని అనుకుంది ఆ మహిళ. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. అనంతరం మృతుడిది సహజ మరణం అని అందరిని ఇరువురూ నమ్మించారు. ఈ కేసును పోలీసులు కూడా ఛేదించలేక పోయారు. కానీ, చివరికి పట్టుబడ్డారు. ఇంతకీ పోలీసులకు ఎలా చిక్కారంటే..
ఇదీ జరిగింది..
తూర్పు దిల్లీలోని మండవాలి ప్రాంతంలో సురేశ్(40).. భార్య హేమ, కుమారుడు నిశాంత్‌తో ఉంటున్నాడు. హేమ ఇదివరకు రోజు కూలీగా పని చేస్తుండేది. అలా పనిచేసే సమయంలో సచిన్ అనే వ్యక్తి ఆమెకు పరిచయమయ్యాడు. ఆ పరిచయం వివాహేతర సంబంధంగా మారింది. అనంతరం వారిద్దరూ కలిసి ఉండాలంటే ఎలాగైనా హేమ భర్తను అడ్డుతొలగించుకోవాలని ప్లాన్ వేశారు. అనుకున్న ప్రకారమే.. ఓరోజు సురేశ్‌కు బలవంతంగా మద్యం తాగించారు. అతడు అపస్మారక స్థితిలోకి జారుకున్నాక.. చున్నీ, కర్టేన్ల సహాయంతో అతడిని కట్టేసి కొట్టారు. అతడు చనిపోయాడని నిర్ధరణ చేసుకునే వరకు.. తలపై, కడుపులో మళ్లీ మళ్లీ కొట్టారు. చనిపోయిన తర్వాత సృహ కోల్పోయాడని సురేశ్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లారు. దీంతో అక్కడి వైద్యులు సురేశ్ చనిపోయాడని ధ్రువీకరించారు. ఇలా నిందితులిద్దరూ బాధితుడిది సహజ మరణంగా చిత్రీకరించారు.
పోస్టు మార్టంతో నిజం వెలుగులోకి..
డిసెంబర్ 7న సురేశ్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని అతడి భార్య హేమ, సోదరుడు దీపక్‌కు అప్పగించారు. అయితే పోస్టుమార్టంలో అసలు నిజం వెలుగులోకి వచ్చింది. మృతదేహం తల, మెడ, ఛాతిపై దెబ్బలు ఉన్నాయని.. చనిపోవడానికి కారణం కొట్టడమే అని వైద్యులు తెలిపారు. పోలీసులు వెంటనే హత్య కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేసేందుకు ఓ బృందాన్ని ఏర్పాటు చేశారు. దర్యాప్తులో భాగంగా మృతుడి భార్యను, బంధువులను విచారించారు. వారి వాంగ్మూలాలను రికార్డు చేశారు. కానీ, వారికి ఎలాంటి క్లూ లభించలేదు.
పొంతన కుదరక పట్టుబడ్డారు..
విచారణ ఇంకా కొనసాగించగా.. మృతుడి భార్య వాంగ్మూలానికి పొంతన కుదరడం లేదని పోలీసులు గ్రహించారు. మృతుడి కుమారుడితో పాటు మరో స్థానికుడు కూడా హేమపై అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు సచిన్, హేమను విచారించారు. అనంతరం వారు నేరాన్ని అంగీకరించారు. తామిద్దరం రెండేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు.. కలిసి జీవించాలనుకున్నట్లు.. ఒప్పుకున్నారు. అందుకే సురేశ్‌ను చంపడానికి పథకం రచించినట్లు చెప్పారు.
మద్యానికి డబ్బులు ఇవ్వలేదని మహిళ హత్య..
కర్ణాటకలో దారుణం జరిగింది. మద్యానికి డబ్బులు ఇవ్వలేదని.. తండ్రి, కుమారుడు కలిసి ఓ మహిళను హతమార్చారు. ఈ ఘటన ఉత్తర కన్నడ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గీతా భట్(64) కుమటా పోలీస్ స్టేషన్ పరిధిలోని కుంజళ్లి అనే ప్రాంతలో నివసిస్తోంది.