ఇద్దరు పిల్లలతో హాయిగా సాగిపోతున్న ఆ కుటుంబంలో ధనాశ చిచ్చుపెట్టింది. రూ.45 లక్షల కోసం తన మరిదితో కలిసి.. కట్టుకున్న భర్తనే హతమార్చింది ఓ భార్య. ముందు మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులకు.. విచారణలో విస్తుపోయే నిజాలు తెలిశాయి.
ఏం జరిగిందంటే?
ఉత్తర్‌ప్రదేశ్ గ్రేటర్ నోయిడాలోని గర్హీ షాహ్‌దరాలో నివాసం ఉండే అజిత్, కవిత దంపతులకు ఇద్దరు పిల్లలు. అజిత్.. ఇటీవల ఓ ఫ్లాట్ అమ్మగా రూ.45లక్షలు వచ్చాయి. ఈ డబ్బును బ్యాంకులో వేశాడు. దీన్ని ఎలాగైనా రాబట్టాలని కవిత.. తన మరిదితో కలిసి పథకం పన్నింది. అనుకున్నట్లుగానే.. అజిత్‌ను హతమార్చి బులంద్‌షహర్ కల్పా గ్రామం వద్ద ఉన్న నదిలో పడేసింది.