Wife Funeral In Front Of Husband House In Gujarat :భర్త ఇంటి ముందే భార్య అంత్యక్రియలు నిర్వహించారు ఆమె తల్లిదండ్రులు. ఈ ఘటన గుజరాత్‌లోని ఛోటా ఉదేపుర్లో జరిగింది. వివాహేతర సంబంధం కారణంగా తమ కూతురిని హత్య చేశాడని ఆరోపిస్తూ అతడి ఇంటి ముందే అంతిమ సంస్కారాలు చేపట్టారు. నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే?
కానిస్టేబుల్ భర్త ఇంటి ముందే భార్య అంత్యక్రియలు- కూతురిని హత్య చేశాడని తల్లిదండ్రుల కోపం! - గుజరాత్లో వివాహిత హత్య
Wife Funeral In Front Of Husband House In Gujarat : భార్యను హత్య చేశాడని ఆరోపిస్తూ భర్త ఇంటి ముందే ఆమె అంత్యక్రియలను నిర్వహించారు కుటుంబ సభ్యులు. ఈ ఘటన గుజరాత్‌లోని ఛోటా ఉదేపుర్లో జరిగింది.
Published : Dec 8, 2023, 8:09 AM IST
|Updated : Dec 8, 2023, 10:57 AM IST
ఇదీ జరిగింది
ఛోటా ఉదేపుర్కు చెందిన కెలిబెన్ వర్షన్భాయ్ రత్వా అనే మహిళ మృతదేహం డిసెంబర్ 5న గొండారియా గ్రామంలోని అడవిలో మధ్యాహ్నం మూడు గంటలకు దొరికింది. అయితే ఆ మహిళ శరీరంపై దాదాపు 20-25 కత్తిపోట్లు ఉన్నాయి. మృతురాలి భర్త వర్షన్భాయ్ ఛోటా ఉదేపుర్ పోలీసు స్టేషన్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. అయితే గత ఏడాది కాలంగా మరో మహిళతో విహేతర సంబంధం పెట్టుకున్నాడు. దీంతో భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి అని మహిళా కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే తమ కూతురిని ఆమె భర్త హత్య చేశాడని ఆరోపిస్తూ కెలిబెన్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన ఛోటా ఉదేపుర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కానిస్టేబుల్ కత్తితో పొడిచి తన భార్యను హత్య చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో కానిస్టేబుల్ వర్షన్భాయ్ను అదుపులోకి తీసుకుని తదుపరి విచారణను చేపట్టారు. నిందితుడని శిక్షించాలంటూ నిరసనకు దిగిన కెలిబెన్ కుటుంబ సభ్యులు, అతడి ఇంటి ఆవరణలోనే అంత్యక్రియలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే గురువారం కెలిబెన్ కుటుంబసభ్యులు, బంధువులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి భర్త ఇంటి ముందే అంత్యక్రియలు చేశారు.
భార్యను చంపి.. శవాన్ని సెప్టిక్ ట్యాంక్‌లో పడేసిన వ్యక్తి.. మూడేళ్లుగా తప్పించుకుంటూ
అంతకుముందు బంగాల్లోని దక్షిణ 24 పరగణాలు జిల్లాలో ఇలాంటి హత్య వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి తన భార్యను హత్య చేసి ఆమె శరీరాన్ని సెప్టిక్ ట్యాంకులో పడేశాడు. మూడేళ్ల క్రితం ఈ ఘటన జరగ్గా తాజాగా మృతురాలి అస్థికలను సెప్టిక్ ట్యాంకులో గుర్తించారు సీఐడీ అధికారులు. మహిళ కనిపించకుండా పోయిన కేసులో ఆమె భర్తను గతంలోనే అరెస్ట్ చేశారు పోలీసులు. అయినప్పటికీ ఆమె మృతి విషయం ఇన్ని రోజులూ మిస్టరీగానే మిగిలిపోయింది. సీఐడీ రంగంలోకి దిగిన తర్వాత కేసు కొలిక్కి వచ్చింది. పూర్తి కథనం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.