బ్యూటీ పార్లర్ ఖర్చులకు డబ్బులు ఇవ్వట్లేదని భర్తతో విడాకులు కోరింది ఓ భార్య. ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలీగఢ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. భర్త నుంచి విడాకాలు కావాలంటూ.. అలీగఢ్ ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది ఆ భార్య. సివిల్ లైన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.
'మేకప్‌కు భర్త డబ్బులు ఇవ్వట్లేదు.. విడాకులు ఇప్పించండి'.. కోర్టులో మహిళ పిటిషన్ - Husband and wife divorce for makeup expenses
మేకప్ చేయించుకునేందుకు డబ్బులు ఇవ్వట్లేదని భర్తతో విడాకులు కోరింది ఓ భార్య. రూ.కోట్లలో పరిహారం కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది ఆ మహిళ. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఈ ఘటన జరిగింది.
వివరాల్లోకి వెళితే..సివిల్ లైన్ ప్రాంతానికి చెందిన మహిళ(25)కు, దిల్లీలో నివాసం ఉండే అమిత్‌తో 2015లో వివాహం జరిగింది. రెండు సంవత్సరాల పాటు బాగానే ఉన్న వీరిద్దరు.. అనంతరం తరచూ గొడవలు పడుతుండేవారు. గత మూడు సంవత్సరాలుగా వీరిద్దరు విడివిడిగా ఉంటున్నారు. వీరికి పిల్లలు కూడా లేరు. ఇప్పుడు ఆ మహిళ విడాకుల కోసం కోర్టులో అర్జీ పెట్టుకుంది. తన భర్త.. మేకప్‌కు, ఇంటి ఖర్చులకు డబ్బులు ఇవ్వట్లేదని, అందుకే విడాకులు కావాలని పిటిషన్లో పేర్కొంది. రూ. కోట్లలో పరిహారం ఇప్పించాలని కోరింది.
"భార్యాభర్తలను కోర్టులో కౌన్సెలింగ్‌కు పిలిచాం. ఇద్దరినీ ఒప్పించేందుకు చాలా ప్రయత్నం చేశాం. అయినా వారిద్దరు కలిసి జీవించేందుకు సిద్ధంగా లేరు. రెండేళ్లుగా విడివిడిగా జీవిస్తున్నారు. జనవరి నెలలో వీరద్దరికి మరోసారి కౌన్సెలింగ్ జరుగుతుంది. వాళ్లను మళ్లీ కలిసి ఉండేలా ఒప్పించేందుకు ప్రయత్నిస్తాం" అని కోర్టు కౌన్సిలెర్ ప్రదీప్ సరస్వత్ తెలిపారు.