తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సోషల్​ మీడియా ఎఫెక్ట్​: భర్త పళ్లు రాలగొట్టిన భార్య!

చాటింగ్​ చేస్తుండగా అడ్డు వచ్చిన భర్తపై ఆగ్రహం చెందిన ఓ మహిళ అతడి పళ్లురాలగొట్టింది. దీంతో ఆ వ్యక్తి పోలీసుల వద్ద తన గోడు వెళ్లబోసుకున్నాడు. ఈ ఘటన హిమాచల్​ ప్రదేశ్​లో జరిగింది.

chatting on social media
భర్త పళ్లురాలగొట్టిన భార్య!

By

Published : Sep 25, 2021, 11:05 AM IST

సోషల్​మీడియా వచ్చాక చాలా మందికి చాటింగే ప్రపంచమైపోయింది. అవతల వ్యక్తితో గంటల తరబడి చాటింగ్​ చేస్తూ కాలం గడుపుతారు. ఇది క్రమంగా కొందరికి వ్యసనంగా మారింది. ఎంత అంటే.. అడ్డు చెప్పిన వారి పళ్లు రాలగొట్టేంత! ఓ మహిళ తన భర్త అడిగిన ప్రశ్నకు ఇలానే బదులిచ్చింది మరి. ఆశ్చర్యం కలిగిస్తున్న ఈ ఘటన హిమాచల్​ ప్రదేశ్​లోని సిమ్లా జిల్లా థియోగ్​లో జరిగింది.

థియోగ్​ సమీపంలోని చైలా చౌకీ ప్రాంతంలో నివసిస్తున్న అమిత్​ కుమార్​.. ఎప్పటిలాగే ఆఫీసు పని పూర్తయ్యాక ఇంటికి వచ్చాడు. ఇంట్లో భార్య చాటింగ్​లో బిజీగా ఉండటం చూసి ఎవరితో చాట్​ చేస్తున్నావ్​ అని అడిగాడు. అంతే.. చాటింగ్​ మధ్యలో అడ్డువచ్చినందుకు భర్తపై ఆగ్రహం చెందిన ఆమె, అతనిపై దాడికి దిగింది. అక్కడే ఉన్న ఓ కర్రతో చితకబాదింది. ఈ క్రమంలో అతని మూడు పళ్లు రాలిపోయాయి.

దీనిపై అమిత్​ పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

ఇదీ చూడండి :Monkey Revenge: కోతి 'పగ'- ఆటోడ్రైవర్ గుండెల్లో దడ!

ABOUT THE AUTHOR

...view details