Wife Bites Husband Tongue in Kurnool : యువతి, యువకులు ప్రేమించి పెళ్లి చేసుకోవడం కామన్ అయిపోయింది. వారి మధ్య ఘర్షణలు చోటు చేసుకోవడం కూడా సహజం అయిపోయింది. కానీ కొందరు చిన్న చిన్న విషయాలను పట్టించుకోకుండా, సర్దుకుని సంసారం ఈదేస్తారు. కాని ఇలా ప్రేమించుకుని, పెళ్లి చేసుకున్న ఓ జంట మాత్రం.. కలతలకు లొంగిపోయి, ఘర్షణకు దిగారు. వివాదలను పక్కన పెట్టి మచ్చిక చేసుకుందామనుకున్న భర్త.. తన భార్యకు ముద్దు ఇవ్వబోయాడు. భర్త ముద్దు ఇవ్వడం ఇష్టం లేని సదరు సతిమఇి.. భర్త నాలుకను కొరికేసింది. దీంతో రక్తమోడుతున్న నాలుకతో.. ఆ భర్త ఆసుపత్రికి పరిగెత్తాడు. తన భార్య నుంచి తనకు, పిల్లలకి ప్రాణహాని ఉందిని కన్నీటి పర్యతం అయ్యాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న వారి జీవితం ఇలా ఎందుకు అయ్యిందో తెలుసుకోవాలంటే మనం కర్నూలు జిల్లా వెళ్లాల్సిందే..
గుంటూరు జిల్లాకు చెందిన తారాచంద్ నాయక్, కర్నూలు జిల్లా తుగ్గలి మండలం చెందిన పుష్పవతి ప్రేమించుకున్నారు. వీరద్దరు 2015లో పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం ఎల్లంగుట్ట తండా గ్రామంలో నివసిస్తున్నారు. పెళ్లి అయినప్పటి నుంచి వారి సంసారం సాజావుగా సాగింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. సజావుగా సాగిన వీరి కాపురంలో గత రెండు సంవత్సరాలు నుంచి తరచుగా గొడవుల పడుతున్నారు. ఈ తరుణంలో శుక్రవారం ఉదయం భార్యాభర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది . ఈ క్రమంలో తన భార్య మచ్చిక చేసుకుందామని దగ్గరకు వెళ్లాడు. తదే సమయంలో భార్యకు ముద్దు పెట్టే ప్రయత్నం చేశాడు.
ఇష్టం లేని భర్త ముద్దు పెట్టడంతో ఆగ్రహానికి లోనైన భార్య.. భర్త నాలుకను కొరికింది. దీంతో తీవ్రంగా గాయపడిన తారాచంద్ నాయక్‌ను చికిత్స నిమిత్తం గుత్తి ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు. ఈ సంఘటనపై జొన్నగిరి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై భార్య భర్తలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. పుష్పవతి భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.