సంసారమన్నాక సవాలక్ష గొడవలుంటాయి. భార్యాభర్తల మధ్య చిన్నచిన్న వాదనలు(husband wife quarrel) రావడం సహజమే. కానీ, ఒక్కోసారి ఇలాంటి చిన్న తగువులే తీవ్రమవుతుంటాయి. అనవసర ఘటనలకు దారితీస్తాయి. హరియాణాలోని హిసార్ జిల్లాలో (hisar in haryana) ఇదే జరిగింది. కూర బాగాలేదని చెప్పిన పాపానికి భర్త తల పగులగొట్టింది (wife attacks husband) భార్య.
ఏం జరిగిందంటే?
దినేశ్, బిందియా అనే దంపతులు బార్వాలా (barwala) పట్టణంలో నివసిస్తున్నారు. ప్రతిరోజులాగే తన భర్త కోసం ఆహారం సిద్ధం చేసింది బిందియా. అయితే, కూరలో ఉప్పు తక్కువైందని భావించిన దినేశ్.. అదే విషయాన్ని భార్యతో చెప్పాడు. ఆహారం అంత రుచిగా లేదని అన్నాడు. ఇకపై కూరల్లో చక్కెర వేయొద్దని తెలిపాడు.
అంతే, ఈ చిన్న విషయానికే భర్త దినేశ్ తలపై ఇనుప రాడ్డుతో కొట్టింది బిందియా. ఇరువురి మధ్య వాదన మొదలైంది. ఇది గమనించిన పొరుగింటి గౌరవ్.. భార్యాభర్తల గొడవలో కల్పించుకుని సర్దిచెప్పాడు. దినేశ్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లాడు.