Wife Attacks Husband: ఆగ్రహంతో ఊగిపోయిన ఓ మహిళ తన భర్త కన్నును తీవ్రంగా గాయపరిచిన సంఘటన మధ్యప్రదేశ్లోని ఛతర్పుర్లో జరిగింది. తీవ్ర రక్తస్రావంతో బాధితుడు ఆసుపత్రిలో చేరాడు. చికిత్స అనంతరం తేరుకుని పోలీసు స్టేషన్కు ఆశ్రయించాడు. భార్యపై ఫిర్యాదు చేశాడు.
బయటకు తీసుకెళ్లలేదని భర్త కన్ను పగులగొట్టిన భార్య.. రాడ్డుతో! - భర్తపై దాడి
Wife attacks husband: హోలీ రోజున సరదాగా అలా బయటకు తీసుకెళ్లాలని కోరగా.. తన మాట వినలేదనే కోపంతో భర్తపై దాడి చేసింది ఓ భార్య. కంటిపై ఇనుప రాడ్డుతో కొట్టటం వల్ల తీవ్ర గాయమైంది. ఈ సంఘటన మధ్యప్రదేశ్లోని ఛతర్పుర్లో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
బయటకి తీసుకెళ్లలేదని భర్తపై భార్య దాడి
ఇదీ జరిగింది:తనను బయటకు తీసుకెళ్లాలని హోలీ రోజున భర్తను కోరింది అతని భార్య. అయితే, ఆమెను తీసుకెళ్లకుండా టీవీ పెట్టుకుని కూర్చుండిపోయాడు. టీవీ కట్టేయాలని ఎన్నిసార్లు చెప్పినా స్పందించలేదు. తన మాటలను పెడచెవిన పెట్టాడని కోపంతో భార్య.. ఓ ఇనుప కడ్డీని భర్త కంట్లోకి దూర్చింది. దాంతో తీవ్ర రక్త స్రావమైంది. భర్తపై దాడి చేసి కోపంతో తన పుట్టింటికి వెళ్లిపోయింది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.