Wife and Husband Died in Karnataka : హత్యకేసులో భర్త, కొడుకు అరెస్ట్ కావడాన్ని తట్టుకోలేని ఓ మహిళ.. ఆత్మహత్య చేసుకుంది. భార్య మరణవార్తను విన్న భర్త కూడా.. జైలులోనే గండెపోటుతో కుప్పకూలాడు. అనంతరం చికిత్స పొందుతూ మృతి చెందాడు. భార్య ఆదివారం చనిపోగా.. భర్త మంగళవారం ప్రాణాలు కోల్పోయాడు. కర్ణాటకలోని మైసూర్ జిల్లాలో జరిగిందీ విషాదం.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
మైసూర్‌లోని విద్యానగర్‌కు చెందిన బాల్‌రాజ్ అనే వ్యక్తి.. శనివారం రాత్రి హత్యకు గురయ్యాడు. ఈ హత్య కేసులో మొత్తం నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో మండి పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసముండే తండ్రీకొడుకులైన తేజస్, సామ్రాట్ ఉన్నారు. ఈ కేసులో ముందు సామ్రాట్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం పరారీలో ఉన్న బాల్‌రాజ్ స్నేహితులు.. సంజయ్, కిరణ్, తేజస్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం వీరిని జైలుకు తరలించారు.
కొడుకు, భర్త అరెస్ట్‌ను తట్టుకోలేని 35 ఏళ్ల ఇంద్రాని.. ఆదివారం ఇంట్లోనే ఆత్మహత్య చేసుకుంది. భార్య మరణ వార్తను తెలుసుకున్న సామ్రాట్ కూడా సోమవారం అర్థరాత్రి జైలులోనే గుండెపోటుతో కుప్పకూలాడు. వెంటనే అతడ్ని ఆసుపత్రికి తీసుకెళ్లిన.. లాభం లేకుండా పోయింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు సామ్రాట్.