తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అమరుడైన 18 ఏళ్లకు ఆ జవాన్ భార్యకు పరిహారం! - Doda Town Hall area

2002 జమ్ము కశ్మీర్​ అసెంబ్లీ ఎన్నికల సమయంలో.. ఉగ్రవాదులతో పోరాడి అమరుడైన ఓ జవాన్​ భార్యకు 18 ఏళ్లకు పరిహారం లభించింది. ప్రధాన ఎన్నికల అధికారి జోక్యంతో ఆ వితంతువుకు ఇన్నాళ్లకు న్యాయం జరిగింది.

Widow of CRPF jawan killed by terrorists during 2002 JK polls gets ex-gratia payment after 18 years
అమరుడైన 18 ఏళ్లకు జవాన్ భార్యకు పరిహారం!

By

Published : Nov 19, 2020, 5:26 PM IST

జమ్ము కశ్మీర్​ అసెంబ్లీ ఎన్నికల విధుల్లో 18 ఏళ్ల కిందట.. ఉగ్రవాదులతో పోరాడుతూ ప్రాణాలొదిలాడు 45వ బెటాలియన్​కు చెందిన సీఆర్​పీఎఫ్​ జవాన్​ రమేశ్​ కుమార్​. దోడా టౌన్​ హాల్​ ప్రాంతంలో 2002 అక్టోబర్​ 8న ఆయన మరణించాడు. అప్పట్లో రూ. 5 లక్షల ఎక్స్​గ్రేషియా ప్రకటించింది ఎన్నికల సంఘం. కానీ.. ఆ మొత్తం ఆయన కుటుంబానికి చేరలేదు.

హరియాణా భివానీలో నివసించే రమేశ్​ కుమార్​ భార్య ప్రమీలా దేవి.. 2019లో ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. సీఈఓ కార్యాలయంలో పెండింగ్​లో ఉందని అప్పుడు వివరణ ఇచ్చారు. ఆ తర్వాత.. ఆమె మరోసారి ఈ ఆగస్టు 10న సీఈసీ సునీల్​ అరోడాకు ఈ-మెయిల్​ చేసి ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కోరింది.

అరోడా జోక్యంతో..

స్పందించిన అరోడా.. ప్రమీలా దేవికి ఎన్నికల యంత్రాంగం తరఫున క్షమాపణలు చెప్పారు. తన భర్త త్యాగం ఎప్పటికీ గుర్తుంచుకుంటారని భరోసానిచ్చారు. తక్షణమే ఆమెకు.. రూ. 20 లక్షల పరిహారం(2002లో రూ. 5 లక్షలు) చెల్లించాలని కమిషన్​ నిర్ణయించినట్లు స్పష్టం చేశారు. ఆ మొత్తాన్ని ఆమె బ్యాంకు ఖాతాకు బదిలీ చేశారు.

ఇంకోసారి ఇలాంటి తప్పిదాలు జరిగితే.. తీవ్ర చర్యలు తప్పవని ఎన్నికల సంఘం అధికారులను హెచ్చరించారు అరోడా.

ABOUT THE AUTHOR

...view details