తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దీదీకి పోటీగా ప్రియాంక.. తెరవెనక బాబుల్​ సుప్రియో! - భాజపా అభ్యర్థి

బంగాల్​ సీఎం మమతపై(mamata banerjee news) భవానీపుర్(bhabanipur bypoll)​ ఉప ఎన్నికలో భాజపా అభ్యర్థిగా ప్రియాంక తిబ్రీవాల్​ను ప్రకటించిన క్రమంలో ఒక్కసారిగా ఆమె పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. ఇంతకి ఆమె ఎవరు? దీదీకీ పోటీగా ఆమెనే ఎందుకు ఎంపిక చేశారు?​

Priyanka Tibriwal
ప్రియాంక తిబ్రీవాల్​

By

Published : Sep 10, 2021, 6:43 PM IST

బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై(mamata banerjee news) భవానీపుర్​ శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నికలో(Bhabanipur bypoll) పోటీకి ప్రముఖ న్యాయవాది ప్రియాంక తిబ్రీవాల్​ను తమ అభ్యర్థిగా ప్రకటించింది భాజపా. పార్టీ నేతలతో విస్తృత చర్చల తర్వాత ఆమె పేరును ఖరారు చేసినట్లు తెలిపింది. బంగాల్​లో పేరుగాంచిన నేతలున్నప్పటికీ.. దీదీకి పోటీగా ప్రియాంక తిబ్రీవాల్​నే ఎందుకు ఎంపిక చేశారు? అనేది చాలా మందిలో మెదిలిన ప్రశ్న.

ఇచ్చిన పనిని విజయవంతంగా పూర్తి చేయటం, అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన హింస కేసులపై టీఎంసీకి వ్యతిరేకంగా పోరాడిన క్రమంలో అధిష్ఠానం దృష్టిలో ప్రియాంక పడ్డారని, అందుకే ఆమెను ఎంపిక చేసినట్లు చాలా మంది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు.. దీదీకి పోటీగా బరిలో దిగేందుకు చాలా మంది విముఖత తెలిపిన క్రమంలో పార్టీకి ఉన్న కొన్ని అవకాశాల్లోంచి తిబ్రీవాల్​ను ఎంపిక చేసినట్లు మరో వర్గం విశ్వసిస్తోంది.

సెప్టెంబర్​ 30న జరగనున్న ఉప ఎన్నికల్లో దీదీని ఎదుర్కోబోతున్నారు ప్రియాంక తిబ్రీవాల్​. ఈ క్రమంలో తిబ్రీవాల్​ గురించి ముఖ్యమైన అంశాలు తెలుసుకుందాం.

  • ప్రియాంక తిబ్రీవాల్​ 1981, జులై 7న కోల్​కతలో జన్మించారు. తన పాఠశాల విద్యను వెల్లాండ్​ గౌల్డ్​స్మిత్​ స్కూల్​లో పూర్తి చేశారు. దిల్లీ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పట్టా అందుకున్నారు. 2007, కోల్​కతా విశ్వవిద్యాలయం పరిధిలోని హజ్రా లా కళాశాల నుంచి న్యాయ విద్య పట్టా అందుకున్నారు. అలాగే థాయిలాండ్​లోని అసంప్సన్​ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు.
  • ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వానికి ఆకర్షితులై, భాజపా నేత బాబుల్​ సుప్రియో సూచనలతో 2014లో కాషాయ పార్టీలో చేరారు ప్రియాంక తిబ్రీవాల్​. సుప్రియోకు లీగల్​ అడ్వైజర్​గా వ్యవహరిస్తున్నారు.
  • 2015లో కోల్​కతా మున్సిపల్​ కార్పొరేషన్​ ఎన్నికల్లో వార్డు నంబర్​ 58లో(ఎంటల్లీ) భాజపా టికెట్​పై పోటీ చేశారు ప్రియాంక. అయితే.. టీఎంసీ అభ్యర్థి స్వపన్​ సమ్మద్దర్​పై ఓటమిపాలయ్యారు.
  • 2020, ఆగస్టులో బంగాల్​ భారతీయ జనతా యువ మోర్చా(బీజేవైఎం) ఉపాధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు ప్రియాంక. ఈ ఆరేళ్ల కాలంలో తనకు అప్పగించిన పనులను విజయవంతంగా పూర్తి చేశారు.
  • ఈఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎంటల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు ప్రియాంక. అయితే.. టీఎంసీ అభ్యర్థి స్వర్ణ కమల్​ సాహాపై 58,257 ఓట్ల తేడాతో ఓడిపోయారు.

అధర్మంపైనే నా పోటీ: ప్రియాంక

మమతా బెనర్జీపై పోటీలో నిలుస్తున్న క్రమంలో ప్రియాంక తిబ్రీవాల్​ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యారు. ఈ క్రమంలో తాను ఏ ఒక్కరికి వ్యతిరేకంగా పోటీ చేయట్లేదని, అధర్మంపైనే పోటీ చేస్తున్నాని వెల్లడించారు. "నా పోటీ ఏ ఒక్కరిపై కాదు, అధర్మంపైనే. బంగాల్​ ప్రజలను కాపాడేందుకే నేను పోటీ చేస్తున్నా. అవును, రాష్ట్రంలో చెలరేగిన హింసపై ఇప్పటికీ ఒక్క మాట మాట్లాడని వ్యక్తి(సీఎం)పైనే నా పోటీ," అని పేర్కొన్నారు ప్రియాంక.

ఇదీ చూడండి:దీదీపై పోటీ చేయనున్న భాజపా అభ్యర్థి ఎవరంటే?

ABOUT THE AUTHOR

...view details