కరోనా సంక్షోభ సమయంలో విదేశాలు భారత్కు అందించిన సాయం వివరాలను కేంద్రం దాస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ప్రపంచ దేశాలు భారత్కు పంపిన వైద్య సామగ్రి వివరాల్లో పారదర్శకత ఎందుకు లేదని ధ్వజమెత్తారు. ఈ విషయంపై కేంద్రానికి ట్విట్టర్ వేదికగా పలు ప్రశ్నలు సంధించారు.
- ఇప్పటివరకు భారత్కు విదేశాలు ఏమేం పంపాయి?
- అవన్నీ ఎక్కడున్నాయి?
- వాటి వల్ల ఎవరికి ప్రయోజనం చేకూరుతోంది?
- రాష్ట్రాలకు వాటిని ఏ విధంగా కేటాయిస్తున్నారు?
- పారదర్శకత ఎందుకు లేదు?
ఈ ప్రశ్నలన్నింటికీ కేంద్రం వద్ద సమాధానాలున్నాయా? అని రాహుల్ ట్వీట్ చేశారు.