Longest Day Of The Year 2023 : సాధారణంగా ఒక రోజులో పగలు 12 గంటలు.. రాత్రి 12 గంటలు ఉంటాయి. అయితే జూన్ 21న మాత్రం పగటి సమయం ఎక్కువగా ఉంటుంది. రాత్రి సమయం సాధారణ రోజులతో పోలిస్తే కాస్త తక్కువ. అందుకే 2023లో అతిపెద్ద పగటి రోజు జూన్ 21. అసలేందుకు ఇలా జరుగుతుందో ఓ సారి తెలుసుకుందామా మరి.
జూన్ 21 గంటల 13 గంటల 7 నిమిషాల పగటి సమయం ఉంటుంది. ఈ రోజు ఉదయం సూర్యోదయం 5 గంటల 34 నిమిషాలకు అయితే.. సాయంత్రం 6.41 నిమిషాలకు సూర్యాస్తమయం అవుతుంది. భూమి ఉత్తర అర్ధగోళం సూర్యుని వైపు వంగి ఉండడం వల్ల జూన్ 21న (బుధవారం) పగటి పూట ఎక్కువ సేపు ఉంటుంది. అందుకే రాత్రి, పగలు ఈ రోజు సమానంగా ఉండకుండా హెచ్చుతగ్గులు ఉంటాయి.
అలాగే దక్షిణ అర్ధగోళంలో ఉన్న యూకే, అమెరికా, రష్యా, కెనడా, భారత్, చైనాలో వేసవి కాలం ముగిస్తే.. అదే సమయంలో ఆస్ట్రేలియా, అర్జెంటీనా, చిలీ, న్యూజిలాండ్‌లో శీతాకాలం ప్రారంభమవుతుంది. సాధారణంగా భారత్‌లో తొలి సూర్యోదయం అరుణాచల్ ప్రదేశ్‌లో జరుగుతుంది. అయితే ఈ ఏడాది 21న మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో తొలి సూర్యోదయం జరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.